Jeep : ఈ జూలైలో ఒక అదిరిపోయే ప్రీమియం SUV కొనాలని ప్లాన్ చేస్తున్న వాళ్లకు ఓ గుడ్ న్యూస్. జీప్ ఇండియా ఈ నెలలో తమ పాపులర్ SUVలైన కంపాస్, మెరిడియన్, గ్రాండ్ చెరోకీ లపై ఏకంగా రూ.3.90 లక్షల వరకు భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్లు కొన్ని వేరియంట్లు, అలాగే కొందరు ప్రత్యేక కస్టమర్లకే వర్తిస్తాయి. ముఖ్యంగా డాక్టర్లు, కార్పొరేట్ ఉద్యోగులు లేదా లీజింగ్ కంపెనీలతో సంబంధం ఉన్నవారికి మరింత ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.
జీప్ మెరిడియన్
జీప్ కంపెనీకి చెందిన 7-సీటర్ ప్రీమియం ఎస్యూవీ జీప్ మెరిడియన్ పై ఈసారి అన్నింటికంటే పెద్ద తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ కారుపై మీరు ఏకంగా రూ.3.90 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో రూ.2.30 లక్షల కన్స్యూమర్ డిస్కౌంట్ ఉంటుంది. దీనికి అదనంగా రూ.1.30 లక్షల కార్పొరేట్ ఆఫర్ కూడా లభిస్తుంది. అంతేకాదు, డాక్టర్లు, లీజింగ్ సంస్థల కోసం రూ.30,000 అదనపు ప్రయోజనం కూడా ఉంది. అయితే, ఈ రూ.30,000 ఆఫర్‌ను కార్పొరేట్ ఆఫర్‌తో కలిపి పొందలేరు.
Also Read: హారియర్ ఈవీ vs క్రెటా ఎలక్ట్రిక్.. ఏది ఎక్కువ దమ్మున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ?
జీప్ కంపాస్
తక్కువ బడ్జెట్లో మంచి ప్రీమియం ఎస్యూవీ కావాలనుకునే వాళ్లకు జీప్ కంపాస్ పై కూడా అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. ఈ మిడ్-సైజ్ SUVపై రూ.2.80 లక్షల వరకు తగ్గింపు (కన్స్యూమర్ డిస్కౌంట్ + కార్పొరేట్ డిస్కౌంట్ కలిపి) లభిస్తోంది. అంతేకాదు, డాక్టర్లు, ఇతర స్పెషల్ ప్రొఫెషనల్స్ కు రూ.15,000ఎక్స్ ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ప్రత్యేక వృత్తిపరమైన డిస్కౌంట్ సాధారణ కార్పొరేట్ డిస్కౌంట్‌తో కలపడానికి వీలు లేదు. మొత్తంగా, జీప్ కంపాస్‌పై గరిష్టంగా రూ.2.95 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు.
జీప్ గ్రాండ్ చెరోకీ
జీప్ కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన లగ్జరీ SUV జీప్ గ్రాండ్ చెరోకీ కొనుగొలు చేయాలనుకునే వాళ్లకు ఏకంగా రూ.3 లక్షల డైరెక్ట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ SUV ఒకే ఒక వేరియంట్ (లిమిటెడ్ (O)) లో వస్తుంది, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.67.50 లక్షలు. ఈ కారుపై ఎలాంటి ఎక్స్ ట్రా స్కీమ్స్ లేనప్పటికీ రూ.3 లక్షల భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ భారీ డిస్కౌంట్స్‌తో పాటు, జీప్ కంపెనీ జీప్ వేవ్ ఓనర్‌షిప్ ప్రోగ్రామ్ ను కూడా అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌లో జీప్ కస్టమర్లకు ప్రీమియం సర్వీసులు, మెయింటెనెన్స్ బెనిఫిట్స్ , కస్టమర్ కేర్ సర్వీసెస్ లభిస్తాయి. ఈ ఆఫర్ల ప్రయోజనాన్ని పొందడానికి దగ్గర్లోని జీప్ డీలర్‌షిప్‌ను సంప్రదించాలి.