SRK Praises Jagapathi Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు కృష్ణవంశీ(Krishna Vamshi)… రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దగ్గర చాలా సంవత్సరాల పాటు అసిస్టెంట్ గా పని చేసిన ఆయన గులాబీ (Gulabi) సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు చాలా వైవిధ్యమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చిన సినిమాలే కావడం విశేషం… ఆయన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను చేసినప్పటికి కొన్ని సినిమాలు మాత్రం ఆయనను ఎవర్ గ్రీన్ డైరెక్టర్ గా నిలబెట్టాయి. ముఖ్యంగా అంతఃపురం (Anthapuram) అనే సినిమా ఆయన కెరియర్ లోనే ఒక క్లాసికల్ సినిమాగా నిలిచిపోయిందని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత్ర సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఈ సినిమాని హిందీలో స్వయంగా కృష్ణవంశీ అయితే రీమేక్ కూడా చేయించారు. అయితే అంతపురం సినిమాలో పోషించిన క్యారెక్టర్ లో షారుక్ ఖాన్ చేశాడు…
Also Read: అల్లు అర్జున్,అట్లీ చిత్రంలో విలన్ గా హాలీవుడ్ యాక్షన్ హీరో..కనీవినీ ఎరుగని రేంజ్ ప్లానింగ్!
అయితే ఒరిజినల్ లో జగపతిబాబు చాలా ఇంటెన్స్ తో నటించాడు. అయితే షారుక్ ఖాన్ నటించేటప్పుడు జగపతిబాబు చేసిన సీన్ ను చాలా క్షుణ్ణంగా పరిశీలించి మరి యాక్టింగ్ చేశారట. ఇక లాస్ట్ లో జగపతిబాబు చనిపోయే ముందు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తాడు. షారుక్ ఖాన్ ఎంత ట్రై చేసినా ఆ ఎక్స్ప్రెషన్ అంత పర్ఫెక్ట్ గా రావడం లేదట.
దాంతో ఆ బాస్టర్డ్ చాలా అద్భుతంగా చేశాడు అంటూ కృష్ణవంశీతో షారుక్ ఖాన్ చెప్పారట. అంటే ఆ క్యారెక్టర్ ని పోషించిన వ్యక్తి గురించి షారుక్ ఖాన్ మాట్లాడడం లేదు. సినిమాలో ఉన్న ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు అని గమనించిన కృష్ణవంశీ ఆ పాత్రకి అంత మంచి గుర్తింపు రావడం ఆయనకి బాగా నచ్చిందట. ఆ విషయాన్ని జగపతి బాబుతో చెప్తే జగపతి బాబు కూడా ఆ క్యారెక్టర్ ఇంటెన్స్ ను బట్టి షారుక్ ఖాన్ అలా అన్నాడు అని చెబుతూనే ఆయన నన్ను ప్రత్యేకంగా అనలేదని అందులో ఉన్న క్యారెక్టర్ ను అన్నాడని అదొక కాంప్లిమెంట్ లా తీసుకున్నాడట.
Also Read: ఉదయ్ కిరణ్ చనిపోవడమే చాలా మంచిది అయ్యింది అంటూ బిగ్ బాస్ విన్నర్ కౌశల్ సంచలన వ్యాఖ్యలు!
మొత్తానికైతే జగపతిబాబు ప్రస్తుతం విలక్షణమైన నటనను చూపిస్తూ తనకంటి ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఏది ఏమైనా కూడా డిఫరెంట్ పాత్రలను ఎంచుకొని చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక జగపతి బాబు ఇంతకుముందు తెలుగులోనే సినిమాలు చేశాడు. కానీ ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో సినిమాలను చేస్తూ తనకంటూ ఒక యూనిక్ స్టైల్ ను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…