Jaguar XJL : జాగ్వార్ కారంటే స్టేటస్ సింబల్. ఆ కారును కొనాలంటే కోట్ల రూపాయల సంపాదన ఉండాలి. అలాగే కోట్ల రూపాయలను ఖర్చు చేయాలి. మరి అలాంటి జాగ్వార్ లగ్జరీ కారు మీకు కేవలం 19 లక్షల రూపాయలకే లభిస్తే ఎలా ఉంటుంది.. మీరు చదువుతున్నది నిజమే. జాగ్వార్ ఎక్స్‌జెఎల్ పోర్ట్‌ఫోలియో కారు ఈ ధరకే అందుబాటులో ఉంటుంది. అంతేకాదు. దీని EMI కూడా కేవలం రూ.32,670 మాత్రమే. ఈ అద్భుతమైన ఆఫర్ ఎక్కడ లభిస్తుందో తెలుసుకుందాం.
ఈ లగ్జరీ కారును ఇంత తక్కువ ధరకు కొనాలనుకుంటే బిగ్ బాయ్ టాయ్జ్ వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వాలి. అక్కడ 2013 నాటి జాగ్వార్ ఎక్స్‌జెఎల్ పోర్ట్‌ఫోలియో మోడల్ అమ్మకానికి ఉంది. ఈ కారు డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు కేవలం 40,000 కిమీ కంటే తక్కువ దూరం మాత్రమే నడిచింది. ఉత్తరప్రదేశ్‌లో రిజిస్టర్ చేయబడిన ఈ సెడాన్ కారును దాని ఫస్ట్ ఓనర్ స్వయంగా విక్రయిస్తున్నారు. బిగ్ బాయ్ టాయ్జ్ ప్లాట్‌ఫామ్ సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లను విక్రయిస్తుంది. లూనార్ గ్రే కలర్‌లో ఉన్న ఈ లగ్జరీ కారులో పవర్ ఫుల్ ఇంజిన్, అద్భుతమైన ఫీచర్లు లభిస్తాయి.
Also Read : భారత్ లో అమ్ముడయ్యే టాప్ లగ్జరీ కార్ బ్రాండ్లు ఇవీ
ఈ కారులో 3.0 లీటర్ V6 టర్బోచార్జ్‌డ్ డీజిల్ ఇంజిన్ లభిస్తుంది. ఈ ఇంజిన్ 225 bhp పవర్, 689 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందించారు. ఈ ఇంజిన్‌తో కారు మైలేజ్ దాదాపు లీటరుకు 12.9 కిమీ. ఈ కారులో ఫోర్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో పాటు పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్, రియర్ వెంటిలేటెడ్ సీట్లు, లెదర్ అప్‌హోల్‌స్ట్రీ, పవర్ టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, పవర్ విండోస్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కారు సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), బ్రేక్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారు 2020లో ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.