Vaibhav Surya Vamsi : వైభవ్ సూర్య వంశీ 18 సీజన్ల ఐపీఎల్ లో గొప్ప గొప్ప ఆటగాళ్లు నెలకొల్పిన రికార్డులను కేవలం మూడో మ్యాచ్ ద్వారానే పటా పంచలు చేశాడు. మరో ఆటగాడికి అవకాశం లేకుండా.. ఇంకే ఆటగాడు తన రికార్డులు బద్దలు కొట్టకుండా చూసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త ఘనతను సృష్టించాడు. సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘనతను అతడు సొంతం చేసుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ మీడియా సైతం తన వైపు చూసే విధంగా చేసుకున్నాడు. ఇక మనదేశంలో అయితే మీడియా.. సోషల్ మీడియా వైభవ్ సూర్య వంశీ నామస్మరణ చేస్తున్నాయి. గుజరాత్ జట్టుపై వీర లెవెల్లో విజృంభణ చేయడం ద్వారా అనేక రికార్డులను వైభవ్ సూర్యవంశీ తన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు.
17 బంతుల్లో వైభవ్ హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు..
ఇక ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా చూసుకుంటే గేల్ అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన ఆటగాడుగా నిలిచాడు.. బెంగళూరు జట్టు తరఫున గేల్ పూణే జట్టుపై 2013లో 30 బంతుల్లోనే శతకం సాధించాడు.
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ 35 బాల్స్ లో సెంచూరియన్ అయ్యాడు. 2025 సీజన్లో జైపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది.
2010లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యూసఫ్ పటాన్ 37 బాల్స్ లోనే సెంచూరియన్ గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ జట్టు పై అతడు ఈ ఘనత సాధించాడు.
2013లో మొహాలీ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ 38 బాల్స్ లో శతక గర్జన చేశాడు.
యువ ఆటగాళ్ల జాబితాలో
Also Read : ఓటముల్లో రాజస్థాన్.. గెలుపుల్లో లక్నో.. ఐపీఎల్ లో ఇదో సంచలనం
గుజరాత్ పై సెంచూరియన్ గా నిలిచిన వైభవ్ సూర్యవంశీ.. 14 ఏళ్ల 32 రోజుల వయసు లో ఈ ఘనత సృష్టించాడు.
మహారాష్ట్ర ఆటగాడు విజయ్ 18 సంవత్సరాల 118 రోజుల్లో ముంబై జట్టుపై 2013లో సెంచరీ చేశాడు.
2020లో పర్వేజ్ హో సైన్ అనే ఆటగాడు 18 సంవత్సరాల 179 రోజుల వయసులో సెంచరీ చేశాడు.
2022లో గుస్తావ్ మెకాన్ ఫ్రాన్స్ అనే ఆటగాడు 18 సంవత్సరాల 280 రోజుల వయసులో స్విట్జర్లాండ్ పై సెంచరీ చేశాడు.
ఇక పవర్ ప్లే లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపిఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. గుజరాత్ జట్టుపై 2025 లో జరిగిన మ్యాచ్లో పవర్ ప్లే లో 87/0 రన్స్ స్కోర్ చేసింది. 2023లో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక్క వికెట్ కోల్పోయి 85 పరుగులు చేసింది. 2021లో చెన్నై జట్టుపై అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్లో ఒక వికెట్ కోల్పోయి 81 పరుగులు చేసింది.
Also Read : వైభవ్ సూర్య వంశీ.. సోషల్ మీడియాలో ఈ బుడ్డోడే ఇప్పడు వైరల్