అదిరిపోయే పోస్టల్ స్కీమ్.. నెలకు రూ.600తో చేతికి రూ.8 లక్షలు..?

మనలో చాలామంది చిన్నమొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి పోస్టాఫీస్ స్కీమ్స్ పై ఆసక్తి చూపుతుంటారు. పోస్టాఫీస్ ఆఫర్ చేస్తున్న స్కీమ్స్ లో పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్స్ లో గ్రామ్ సంతోష్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఒకటని చెప్పవచ్చు. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరైతే ఈ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటారో వాళ్లు […]

Written By: Navya, Updated On : April 22, 2021 6:11 pm
Follow us on

మనలో చాలామంది చిన్నమొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి పోస్టాఫీస్ స్కీమ్స్ పై ఆసక్తి చూపుతుంటారు. పోస్టాఫీస్ ఆఫర్ చేస్తున్న స్కీమ్స్ లో పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్స్ లో గ్రామ్ సంతోష్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఒకటని చెప్పవచ్చు. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు పొందే అవకాశాలు అయితే ఉంటాయి.

ఎవరైతే ఈ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటారో వాళ్లు రోజుకు కేవలం 22 రూపాయలు ఆదా చేయడం ద్వారా ఏకంగా 8 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఎండోమెంట్ అస్యూరెన్స్ స్కీమ్ అయిన గ్రామ్ సంతోష్ స్కీమ్ లో కనీసం 19 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు చేరవచ్చు. కనీసం 10 వేల రూపాయల మొత్తానికి బీమా తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. గరిష్టంగా 10 లక్షల రూపాయల మొత్తానికి బీమా తీసుకునే అవకాశం ఉండగా 55 ఏళ్లలోపు వయస్సు వాళ్లు ఈ పాలసీని పొందవచ్చు.

పాలసీ టర్మ్ 35, 40, 45, 50, 55, 58, 60 ఏళ్లుగా ఉంటుంది. 25 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి కనీసం 3 లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే 35 సంవత్సరాలకు 4.44 లక్షలు లభిస్తుండగా 60 ఏళ్లకు రూ.8.04 లక్షలు లభించే అవకాశం ఉంటుంది. తక్కువ ప్రీమియంతో ఆకర్షణీయ రాబడి పొందాలని అనుకునే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ అని చెప్పవచ్చు.

తక్కువ ప్రీమియంతో ఏకంగా మెచ్యూరిటీ సమయంలో రూ.8.4 లక్షలు పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్‌‌లో పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్ లలో ఒకటైన గ్రామ్ సంతోష్ ఇన్సూరెన్స్ స్కీమ్ లో చేరడం వల్ల అదిరిపోయే లాభాలను సులువుగా పొందవచ్చు.