Homeబిజినెస్Anant Ambani Radhika Wedding: 7 నెలల క్రితం ఎంగేజ్మెంట్.. నేడు జియో వరల్డ్ సెంటర్లో...

Anant Ambani Radhika Wedding: 7 నెలల క్రితం ఎంగేజ్మెంట్.. నేడు జియో వరల్డ్ సెంటర్లో ఏడడుగులు.. అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహం వెనుక ఎంత కథ నడిచిందంటే.

Anant Ambani Radhika Wedding: భారతదేశంలో అతిపెద్ద శ్రీమంతుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – ఫార్మా దిగ్గజం వీర్యం మర్చంట్ కూతురు రాధికా మర్చంట్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా బుధవారం అనంత్ – రాధిక వివాహ వేడుక జరిగింది.. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు హాజరయ్యారు. సెలబ్రిటీల రాకతో ముంబై నగరం మొత్తం సందడిగా మారింది. ముఖ్యంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ కు వెళ్లే దారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు హాజరు కావడంతో జియో వరల్డ్ సెంటర్ కిటకిటలాడుతోంది. అనంత్ – రాధిక వివాహానికంటే ముందు ముఖేష్ అంబానీ కుటుంబం చాలా వేడుకలు జరిపింది.. నిశ్చితార్థం, ముందస్తు పెళ్లి వేడుకలు, పేద యువతీ యువకులకు వివాహాలు, జామ్ నగర్ వాసులకు విందు వంటి కార్యక్రమాలు చేపట్టింది. వాస్తవానికి ఈ వివాహానికి సంబంధించి ముఖేష్ కుటుంబం 7 నెలల నుంచే కసరత్తు మొదలు పెట్టింది.

Also Read: అంగరంగ వైభవంగా అనంత్ అంబానీ – రాధిక మర్చంట్‌ పెళ్లి.. ఖర్చు ఎంతో తెలుసా?

ముఖేష్ – నీతా దంపతుల రెండవ కుమారుడు అనంత్, వీరేన్ – శైల దంపతులకు మారుతి రాధిక మధ్య ముందుగా స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. పెద్దలు అంగీకరించడంతో వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించింది. డిసెంబర్ 29, 2023న రాధిక – అనంత్ నిశ్చితార్థం చేసుకున్నారు. రాజస్థాన్లోని ఓ ప్రముఖ ఆలయంలో రెండు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ క్రతువు నిర్వహించారు. జనవరి 18, 2024న మెహంది కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత మరుసటి రోజు ఎంగేజ్మెంట్ పార్టీ జరిపారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, ఐశ్వర్యరాయ్ వంటి పలువురు టాప్ సెలబ్రిటీలు హాజరయ్యారు. పార్టీలో డ్యాన్స్ చేసి ఆహూతులను అలరించారు. ఈ కార్యక్రమం తర్వాత ముందస్తు పెళ్లి వేడుక పేరుతో జామ్ నగర్లో ముఖేష్ అంబానీ కుటుంబం భారీగా సంబరాలు జరిపింది. మూడు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించింది.

ఈ మూడు రోజుల ముందస్తు పెళ్లి వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా 1,200 మంది ప్రముఖులు హాజరయ్యారు. వారందరికీ వందమంది షెఫ్ లు 500 రకాల వంటకాలను వడ్డించారు. ఈ సందర్భంగా అమెరికన్ గాయని రియాన్నా తన ఆటపాటలతో అతిధులను అలరించింది. ఈ వేడుకలకు ప్రపంచ కుబేరులు బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్, ఇవాంక ట్రంప్ వంటి వారు హాజరయ్యారు. మీరు మాత్రమే కాకుండా కెనడా, స్వీడన్, ఖతార్ దేశాలకు చెందిన ప్రధానమంత్రులు, మాజీ ప్రధానులు, భూటాన్ రాని వంటి వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కంటే ముందు జాంనగర్ వాసులకు అద్భుతమైన విందు ఇచ్చారు. జామ్ నగర్ లో ముందస్తు వివాహ వేడుకలు పూర్తయిన తర్వాత.. ఇటీవల అనంత్ – రాధిక ఇటలీలోని ఓ లగ్జరీ ఓడలో నాలుగు రోజులపాటు ముందస్తు పెళ్లి వేడుకలు జరుపుకున్నారు.ఈ వేడుకల్లో ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ, ఇటలీకి చెందిన ప్రముఖ అంధ గాయకుడు ఆండ్రియా తమ గాత్ర మాధుర్యంతో ఆకట్టుకున్నారు.

Also Read: వంద విమానాలు.. ముంబైలోని అని లగ్జరీ హోటల్ రూమ్స్ బుక్.. అంబానీ ఇంటి పెళ్లికి అదిరిపోయే ఏర్పాట్లు ఇవీ

జామ్ నగర్ నుంచి మొదలు పెడితే ఇటలీ వరకు దాదాపు 134 రోజులపాటు జరిగిన వివిధ వేడుకల కోసం అంబానీ కుటుంబం దాదాపు 1200 కోట్ల దాకా ఖర్చు పెట్టిందని తెలుస్తోంది. వివాహ వేడుకల కోసం మరో 400 కోట్లకు మించి ఖర్చయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఇక అంబానీ కుటుంబం పెట్టిన ఖర్చును బ్రిటన్ కేంద్రంగా నడిచే ప్రముఖ వార్తా సంస్థ డైలీ మెయిల్ 1200 కోట్లుగా అంచనా వేసింది. కేవలం వంటకాల కోసమే అంబానీ కుటుంబం 210 కోట్ల దాకా ఖర్చు చేసి ఉండవచ్చని పేర్కొన్నది.

ఇక ఇటీవల మొదలైన పెళ్లి వేడుకల్లో భాగంగా అంబానీ కుటుంబం సామూహిక వివాహ కార్యక్రమాన్ని జరిపింది. ముంబై నగరానికి సమీపంలోని పాల్ గాడ్ ప్రాంతంలోని 50 మంది పేద కుటుంబాలకు చెందిన యువతీ యువకులకు వివాహ క్రతువు నిర్వహించింది. వారికి భారీగా కానుకలు అందజేసింది. ఇక జూలై 5న సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హాలీవుడ్ గాయకుడు జస్టిన్ బీబర్ సందడి చేశాడు. జూలై 8న హల్దీ వేడుక జరిపారు. ఇక జూలై 12 శుక్రవారం రాధిక మెడలో అనంత్ తాళికట్టాడు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వివాహ క్రతువు జరిగింది. ఈ వేడుకను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా 16 వేలమంది అతిరథ మహారధులు హాజరయ్యారు..

పెళ్లి వేడుకల కోసం బాలీవుడ్, టాలీవుడ్ నటులు హాజరయ్యారు. ఇందులో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు, ప్రముఖ దర్శకుడు అట్లీ, ఆయన భార్య ప్రియ, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత, కూతురు సితార, జాన్వి కపూర్, ఖుషి కపూర్, మహేంద్ర సింగ్ ధోని, ఆయన భార్య సాక్షి, డబ్ల్యూ డబ్ల్యూ ఈ మాజీ రెజ్లర్ జాన్ సీనా వంటి వారు హాజరయ్యారు. జాన్ సీనాకు ముఖేష్ అంబానీ సాదర స్వాగతం పలకగా.. ఆయన కుమార్తె చిరునవ్వుతో ఆహ్వానించారు.. ఇక ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. వారందరికీ ముఖేష్ సాదర స్వాగతం పలికారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular