Anant Ambani Radhika Wedding: ప్రపంచ కుబేరుల్లో ఒకరు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జామ్‌నగర్‌లో, ఇటలీలో క్రూయిజ్‌లో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకే వేల కోట్లు ఖర్చు చేసిన అంబానీ, ఇక పెళ్లికి అంతకు మించి ఖర్చు చేస్తున్నారు. దాదాజు జూలై 1వ తేదీ నుంచి ముంబైలోని అంబానీ నివాసంలో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపత్యంంలో అనంత్ అంబానీ– రాధికా మర్చంట్ పెళ్లికి అంబానీలు ఎంత ఖర్చు చేస్తున్నారు అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
పెళ్లంటేనే వేడుక..
భారతీయ సంస్కృతిలో పెళ్లి అంటేనే ఓ వేడుక. పేదింటి నుంచి పెద్దింటి వరకు ఉన్నంతలో భారీగానే పెళ్లిళ్లకు ఖర్చు చేస్తుంటారు. ఇక కుబేరుడి ఇంట్లో పెళ్లి అంటే మామూలుగా ఉండదు కదా. ఇదే ఇప్పుడే ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎవరూ కనీ, విని ఎరుగని రీతిలో తమ చిన్న కుమారుడి పెళ్లి జరిపిస్తున్నారు ముఖేష్–నీతా అంబానీ దంపతులు. అనంత్ అంబానీ– రాధికా మర్చంట్‌ల వివాహం ప్రముఖుల మధ్య అత్యంత ఘనంగా శుక్రవారం జరగనుంది.
ఖర్చు రూ.5 వేల కోట్లకుపైనే..
ఇక అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహానికి ముఖేష్ సుమారు రూ.5 వేల కోట్ల వరకు కర్చు చేసి ఉంటారని తెలుస్తోంఇ. రెడ్డిట్‌లో ఈమేరు ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ పెళ్లి ఖర్చు ముఖేష్ అంబానీ ఆస్తుల విలువలో కేవలం 0.5 శాతం మాత్రమేనని ఆ పోస్ట్ పేర్కొంది. ఈ పోస్ట్ చేసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కామెంట్లు ఇలా..
‘అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ పెళ్లి ఖర్చు సుమారు రూ.1,000–2,000 కోట్లు అవుతుందని అంచనాలు ఉన్నాయి. కానీ, 5,000 కోట్లు ఖర్చు చేశారా? మైండ్ బ్లోయింగ్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
‘కుటుంబంలోని ఐదు తరాలు సంతోషంగా ఉండటానికి ఇంత మొత్తం సరిపోతుంది’ అని మరో నెఇజన్ పేర్కొన్నారు.
‘అంబానీలు రోజు రూ.3 కోట్లు ఖర్చు పెడితే.. వారి సంపద వారికి 962 సంవత్సరాలు వస్తుంది అని ఒక వ్యాసంలో చదివాను,‘ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. రూ.3 కోట్లు జస్ట్ బేస్ వెల్త్ అని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డారు.
‘గరీబో కో క్రోర్ దాన్ యోజనను (పేదలకు ఒక కోటి ధానం పథకం) ప్రారంభించాలి’ అని మరో యూజర్ ట్వీట్ చేశారు.
‘వ్యాపారవేత్తలు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా డబ్బులు ఖర్చు పెట్టారు’ అని మరొకరు అభిప్రాయపడ్డారు.
‘రూ.5 వేల కోట్ల విలువ 600 మిలియన్ డాలర్లు. అమెరికాలో 10 ఆస్కార్ వేడుకలకు ఇది సరిపోతుంది. యూజర్ కామెంట్ చేశాడు. ఇటలీలో క్రూయిజ్ పార్టీకి రూ.1000 కోట్లు ఖర్చు అవ్వదని, జామ్ నగర్ ప్రీ వెడ్డింగ్ వేడుకలను కలుపుకున్నా రూ.5000 కోట్ల పెళ్లి అసాధ్యం’ అని వివరించారు.
‘వ్యాపారవేత్తలు అంత డబ్బు ఖర్చు పెట్టడానికి మూర్ఖులు కాదు. ప్రతిఫలం లేకుండా వారు ఏమీ చేయరు. ప్రతిదీ తమ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అవకాశంగా భావిస్తారు. వారి పిల్లల సంబంధాలు కూడా ఇందులో భాగం’ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు
సగటు భారతీయుడి పెళ్లికన్నా తక్కువే..
ఇదిలా ఉంటే.. పెళ్లి ఖర్చు రూ.5 వేల కోట్లు అంటే భారీగా అనిపిస్తున్నా.. సగటు భారతీయుడు తన సంపదలో చేసే ఖర్చుతో పోలిస్తే.. అంబానీ చేసిన ఖర్చు చాలా తక్కువని అవుట్‌లుక్ నివేదిక తెలిపింది. ప్రతీ భారతీయ కుటుంబం పెళ్లి కోసం తమ సంపాదనలో 5 శాతం నుంచి 15 శాతం ఖర్చు చేస్తుందని పేర్కొంది. అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహానికి మాత్రం ముఖేష్ అంబానీ తన ఆస్తి విలువలో చేసిన ఖర్చు కేవలం 0.5 శాతమే అని తెలిపింది.
నాలుగు నెలలుగా వేడుకలు..
ఇదిలా ఉంటే.. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. దాదాపు నాలుగు నెలలుగా జరుగుతూనే ఉన్నాయి. మార్చిలో ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. తర్వాత ఇటలీలో క్రూయిజ్‌లో మరో ప్రీవెడ్డింగ్ వేడుక నిర్వహించారు. తాజాగా జూౖలñ 12 వివాహం జరిగింది. రిసెప్షన్‌తో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఇక వివాహానికి యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, కిమ్ కర్దాషియాన్, శాంసంగ్ సీఈవో హాన్‌జాన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ వివాహాని హాజరయ్యారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Anant ambani radhika merchant wedding in grandeur do you know the cost
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com