Anant Ambani Radhika Wedding
Anant Ambani And Radhika Wedding: ఆకాశమంత పందిరి.. భూదేవంత మండపం.. అనే సామెత తీరుగా ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. భారతదేశంలో అతిపెద్ద ధనవంతుడైన ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ – ప్రముఖ ఫార్మా వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కూతురు రాధికామర్చంట్ కు వివాహం ఘనంగా జరిపిస్తున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వివాహ వేడుక జరుగుతోంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో మన దేశానికి చెందిన సినీ నటులు కూడా ఉన్నారు. అతిరథ మహారధుల రాకతో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ మాత్రమే కాకుండా ముంబై నగరం కూడా కిటకిటలాడుతోంది.
ఈ వివాహ వేడుకకు సంబంధించి సోషల్ మీడియాలో పలు చిత్రాలు సందడి చేస్తున్నాయి. అందులో ఒక వీడియో సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. అనంత్ – రాధిక వివాహ వేడుకల్లో భాగంగా వీరేన్ మర్చంట్ కుటుంబం శాంతి పూజ, గృహ పూజ నిర్వహించింది. ఉత్తరాది సాంప్రదాయం ప్రకారం దీనిని నిర్వహిస్తారు. గృహ పూజ, శాంతి పూజలో భాగంగా తమ పూర్వీకులను గౌరవించుకుంటారు. వారిని స్మరించుకుంటూ కలశం లో పరిశుద్ధమైన జలాలను నింపి.. మామిడి ఆకుతో వారి ఆత్మకు శాంతించాలని చల్లుతుంటారు. ఈ పూజ తర్వాత నవగ్రహ ఆరాధన జరిపారు. ఈ సందర్భంగా అనంత్ – రాధిక దండలు మార్చుకున్నారు. ఒకరిని ఒకరు ఆట పట్టించుకున్నారు. ఇదే సమయంలో తమ ఇద్దరి మధ్య స్నేహం ఎలా మొదలైంది? అది ప్రేమగా ఎలా మారింది? ఇద్దరూ కలిసి సాగించిన ప్రయాణం ఎలా ఉంది? ఎన్ని రోజుల ఈ కాలంలో ఎలాంటి అనుభూతులను వారు పొందారు? వంటి విషయాలను పరస్పరం పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరి ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం.. ముందుగా ఒక కుర్చీలో రాధిక కూర్చోగా.. ఆ తర్వాత అనంత్ వచ్చి కూర్చున్నాడు. తన చేతి సైగలతో రాధికను ఆట పట్టించాడు. ఆమె కూడా అదే స్థాయిలో అతనిని ఆటపట్టించింది. ఈ దృశ్యాలను చూసిన ముకేశ్ అంబానీ కన్నీటి పర్యంతమయ్యాడు. రాధిక తల్లిదండ్రులు వీరేన్ – శైల దంపతులు కూడా ఉద్వేగానికి గురయ్యారు.
నవగ్రహ ఆరాధన పూర్తయిన తర్వాత అనంత్ – రాధిక ఒకరిని ఒకరు ఆ లింగనం చేసుకున్నారు. ఈ సమయంలో బంధువులంతా వారిపై అక్షింతలు చల్లి శుభాశీస్సులు అందించారు. నీతా అంబానీ, అనిల్ అంబానీ, కోకిలా బెన్ వంటి వారు నూతన వధూవరులను ఆశీర్వదించారు.. ఈ వేడుక జరిపిన ప్రాంతం రాజప్రసాదాన్ని తలపించింది. అక్కడ ఏర్పాటు చేసిన ప్రతి వస్తువు ఆశ్చర్యాన్ని కలిగించింది. గ్రాండియర్ అనే పదం చిన్నబోయేలా అక్కడ ఏర్పాటు చేశారు. కళ్ళు మిరమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు, ఖరీదైన వస్త్రాలు, ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న పుష్పాలు, బంగారు ఆభరణాలు, విలువైన కార్పెట్లు వంటి వాటితో ఆ ప్రాంతం శోభాయ మానంగా దర్శనమిచ్చింది..
కాగా తన కొడుకు వివాహ వేడుకను చూసి ముకేశ్ అంబానీ కన్నీటి పర్యంతమవుతున్న వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అంతకుముందు జాంనగర్ వేదికగా జరిగిన ముందస్తు పెళ్లి వేడుకల్లో.. అనంత్ అంబానీ తన జీవితం గురించి, తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నప్పుడు ముకేశ్ అంబానీ ఇదే తీరుగా భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ.. కొడుకు చెబుతున్న మాటలను వింటూ మురిసిపోయాడు. అప్పట్లో ఈ దృశ్యం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
View Author's Full InfoWeb Title: Ananth ambani and radhika share some adorable wedding moments