Innovative Startup Idea: ఆలోచన ఉండాలి కానీ అద్భుతాలు సృష్టించవచ్చు. అప్పట్లో స్థానికంగానే టీ దుకాణాలు ఉండేవి. కానీ ఇప్పుడు టీ టైం( tea time ) షాపులు వచ్చాక.. రకరకాల తేనేటి విందు కనిపిస్తోంది. టీ అనేది పాతదే అయినా.. దానిని సృజనాత్మకత జోడించేసరికి అదో కార్పొరేట్ వ్యాపారంగా విస్తరించింది. అటువంటి ఆలోచన చేశారు విజయవాడకు చెందిన ఓ యువకుడు. ఏకంగా కొబ్బరితో 60కి పైగా పదార్థాలను తయారుచేసి అబ్బురపరుస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో కొబ్బరి పదార్థాల విక్రయాలు ప్రారంభించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించినందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. కోస్తాలో పండే కొబ్బరికి జాతీయస్థాయిలో గుర్తింపు తేవాలన్న తపనతోనే ఇదంతా చేస్తున్నట్లు ఆ యువకుడు చెబుతున్నారు. ‘కోకో ముంజ్’ ( coco munj ) అనే పేరుతో ఓ బ్రాండ్ సృష్టించి కొబ్బరితో తయారుచేసిన ఆహారాన్ని జాతీయవ్యాప్తం చేయాలని భావిస్తున్నాడు ఆ యువకుడు.
Also Read: Deepthi Sunaina looks stunning: గ్రీన్ చీరలో బార్బీ బొమ్మకు చెల్లెలి లా కనిపిస్తున్న దీప్తి
సృజనాత్మక ఆలోచనలతో..
విజయవాడకు చెందిన వేపూరి వెంకట వికాస్( Venkata Vikas) కొబ్బరితో సృజనాత్మక ప్రయోగాలకు తెర తీశాడు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లపల్లిలో ఒక పరిశ్రమను ఏర్పాటు చేశారు. అక్కడ తయారు చేసిన 60 రకాల కొబ్బరి పదార్థాలను విజయవాడలో విక్రయిస్తున్నాడు. త్వరలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అవుట్ లెట్ లు ఏర్పాటు చేసి విక్రయాలు విస్తరించే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఈ పరిశ్రమలో తయారుచేసి ప్రతి పదార్థంలో కూడా కొబ్బరిని వాడడం ప్రత్యేకం.
1. సాధారణంగా తాటి ముంజలు ఉంటాయి. కొబ్బరి ముంజలు తయారుచేసి ప్రజలకు అందిస్తున్నాడు. ఎలాంటి రంగు, రసాయనాలు కలపకుండా.. కేవలం కొబ్బరి నీరు తోనే కొబ్బరి ముంజలను తయారుచేసి విక్రయిస్తున్నాడు.
2. సాధారణంగా కోల్డ్ బ్రూస్ కాఫీలను నీళ్లతో తయారు చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం కొబ్బరి నీటితో కాఫీ చేసి అందిస్తున్నారు.
3. కొబ్బరి తురుము, పాలు, నేటితో 20 కి పైగా వంటకాలు తయారు చేసే అందిస్తున్నారు. 40 రకాల కేకులు, మిల్క్ షేక్ లు, ఐస్ క్రీములు, బిస్కెట్లు, కాఫీలను తయారు చేస్తున్నారు.
4. కొబ్బరి పిండితో ఏకంగా పిజ్జాలు తయారు చేస్తున్నారు. సాధారణంగా మైదా వాడుతారు పిజ్జా తయారీలో. ఇక్కడ మాత్రం కొబ్బరి పిండితో రుచికరంగా పిజ్జాలు తయారు చేయడం విశేషం.
5. పాస్తాలో పాల క్రీమ్ బదులు కొబ్బరి క్రీమ్, కొబ్బరి పాలతో ఐస్ క్రీమ్, నూనెలో వేయించకుండా వేడిగాలి యంత్రాలతో కొబ్బరి చిప్స్ వంటివి తయారు చేస్తున్నారు.
6. కొబ్బరి పాలతో మామిడి, జాక్ ఫ్రూట్, సీతాఫలం, లోటస్ బిస్కేఫ్, బెల్జియం చాక్లెట్, డార్క్ చాక్లెట్ వంటి ఫ్లవర్లతో ఐస్ క్రీమ్ ను కూడా తయారు చేస్తున్నారు.
Also Read: Hardik Pandya divorce: మనసు విప్పిన హార్దిక్ విడాకుల తర్వాత మొదటి స్పందన
కొబ్బరి అంటే చాలా ఇష్టం..
సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు వికాస్. పూర్వీకులు పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారు. 2019లో వికాస్ కొబ్బరిపొడి పరిశ్రమను ఏర్పాటు చేశారు. అందులో నష్టం తప్పలేదు. ప్రస్తుతం కో కో ముంజ్ బ్రాండ్స్ తయారీలో సక్సెస్ అయ్యారు. ఎప్పటి వరకు రైతుల నుంచి కోటి కొబ్బరికాయలను కొనుగోలు చేశారు. ఏటా ఎనిమిది కోట్ల వరకు రాబడి వస్తోందని వికాస్ చెబుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న నగరాలకు ఈ బ్రాండ్ ను విస్తరించాలని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున అవుట్ లెట్ లు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు.