Kota Shopkeeper: ఒంటిపై యూనిఫాం ఉందన్న బలుపో, తనను ఎవరు ఏమి చేయలేరనే కండకావరమో తెలియదు గాని.. ఓ పోలీస్ అధికారి రెచ్చిపోయాడు. సాధారణంగా క్రిమినల్స్ పట్టుకోవడంలో.. సంఘ విగ్రహశక్తులను తొక్కి పెట్టడంలో చూపించాల్సిన దూకుడును ఓ షాప్ ఓనర్ మీద చూపించాడు. పైగా అతనిని దారుణంగా కొట్టాడు. దీంతో ఆ షాప్ ఓనర్ స్పృహ తప్పి పడిపోయాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ పోలీసు అధికారిపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా ప్రాంతంలో వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతంలో.. ఓ వ్యక్తి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతడి షాప్ ఎదుట మరో వ్యక్తి బైక్ పార్క్ చేశాడు. ఈ క్రమంలోనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ పుష్పేంద్ర తన పోలీసు వాహనంలో వచ్చాడు. ఆవాహంలో ఇతర పోలీసులు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎస్ హెచ్ ఓ షాప్ ముందు ఉన్న బైక్ తీయాలని యజమాని ఆదేశించాడు. ఆ బైక్ నాది కాదని.. హ్యాండిల్ లాక్ వేసి ఉందని ఆ షాప్ ఓనర్ బదులిచ్చాడు. షాపు ఓనర్ తనకు వ్యతిరేకంగా మాట్లాడిన నేపథ్యంలో ఎస్హెచ్ఓ ఒంటి కాలు మీద లేచాడు. అంతేకాదు ఆ షాపు ఓనర్ మీద తీవ్రస్థాయిలో దుర్భాషలాడాడు. రాయడానికి వీలు లేని భాషలో తిట్టాడు. అంతేకాదు ఇతర పోలీసులను పురమాయించి అతడిని వాహన వద్దకు తీసుకురావాలని సూచించాడు. అతడు చెప్పినట్టుగానే ఆ పోలీసులు కూడా ఆ షాప్ ఓనర్ ను ఎస్ హెచ్ వో వద్దకు తీసుకువచ్చారు. దీంతో ఆ పోలీస్ అధికారి ఆ షాపు ఓనర్ ను లాగిపెట్టి కొట్టాడు. దీంతో ఆ షాప్ ఓనర్ ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు.
ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలలో రికార్డు అయింది. ఈ వీడియో కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పై తీవ్రస్థాయిలో నెటిజన్లు మండిపడుతున్నారు..” ఒంటి మీద ఖాకీ దుస్తులు ఉంటే రెచ్చిపోతారా? ఈ ప్రతాపం ఉగ్రవాదుల మీద చూపించండి. తీవ్రవాదుల మీద చూపించండి. సంఘ విద్రోహ శక్తుల మీద చూపించండి. దారుణాలకు పాల్పడుతున్న నేరగాళ్ల మీద చూపించండి. అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్న వ్యక్తుల మీద చూపించండి. అంత తప్ప ఇలాంటి షాప్ ఓనర్ల మీద కాదు. అతడు పోలీసు వాహనంలోకి వస్తుంటే కొట్టాల్సిన అవసరం ఏముంది. అతడు స్పృహ తప్పి పడిపోయాడు. ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒకవేళ అతడికి జరగరానిది ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని” నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షించాలని.. అసాంఘిక శక్తులను తొక్కి పెట్టాలని.. అంతేతప్ప ఇలా ఎటువంటి నేరాలు చేయని వారి మీద ఉక్కు పాదం మోపితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పనులకు పాల్పడే పోలీస్ అధికారులకుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సామాన్యులపై పోలీసులు ప్రతాపం చూపించడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు . ఇటువంటి దారుణానికి పాల్పడిన పోలీసు అధికారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Meet SHO Pushpendra Bansiwal of @KotaPolice who slapped a shopkeeper so hard that he instantly fainted and became unconscious.
It was alleged that the SHO asked the shopkeeper to remove a bike parked in front of his shop in the Kaithunipol area of Kota in Rajasthan. The… pic.twitter.com/WHC4mWeXev— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) June 29, 2025