Banakacharla Project: బనకచర్ల( Banakacherla).. ఇటీవల తరచూ వినిపిస్తున్న మాట ఇది.. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత బనకచర్ల ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. సముద్రంలో కలిసే వృధా జలాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు భావించారు. అది పోలవరం ప్రాజెక్టు ద్వారా బనకచర్లకు అనుసంధానించి.. రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్నది చంద్రబాబు ప్రణాళిక. అయితే తెలంగాణ ప్రభుత్వంతో పాటు అక్కడ అన్ని రాజకీయ పక్షాలు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు నిర్మించకూడదని భావిస్తున్నాయి. అయితే ఇది సంక్లిష్టమైన సమస్యగా మారిన నేపథ్యంలో.. బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం పర్యావరణ అనుమంతులను నిలిపివేసింది. ఒక విధంగా ఇది ఏపీలో కూటమి ప్రభుత్వానికి షాకింగ్ పరిణామమే.
Also Read: పోలీస్ కండకావరం.. లాగిపెట్టి కొట్టడంతో స్పృహ తప్పిపోయిన షాపు ఓనర్: వైరల్ వీడియో
* వృధా జలాలను వినియోగించుకునేందుకు.. గోదావరిలో( Godavari) నిరంతర నీటి ప్రవాహం ఉంటుంది. వర్షాకాలంలో అయితే భారీ స్థాయిలో వరద నీరు పోటెత్తుతుంది. ఆ సమయంలో వేల టిఎంసిల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంది. అయితే ఏటా వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు వీలుగా బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలన్నది ఏపీ ప్రభుత్వ లక్ష్యం. ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్టు ఏటా రెండు వేల టీఎంసీల నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతుంది. అందుకే వరదల సమయంలో 200 టీఎంసీలను మళ్లించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. అందుకే గోదావరి- బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది.రూ. 80,112 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటుకు సైతం ఏపీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
* రాయలసీమ సస్యశ్యామలం..
ఈ ప్రాజెక్టుతో రాయలసీమ( Rayalaseema ) సస్యశ్యామలంగా మారుతుంది అన్నది ప్రభుత్వ ఆలోచన. తాగునీటితోపాటు కొత్తగా మూడు లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. సాగర్ కుడి కాలువ, వెలిగొండ, గాలేరు, నగరి, కెసి కెనాల్, తెలుగు గంగా కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలన్నది ఏపీ ప్రభుత్వం నిర్ణయం. మూడు దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలన్నది ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణానదిలోకి.. అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్ లోకి నీటిని మళ్లించనున్నారు. అక్కడ నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలించాలన్నది ఏపీ సర్కార్ ప్లాన్. అంటే మొదటి దశ కింద పోలవరం నుంచి కృష్ణా నదికి జలాల మళ్లింపు, సెకండ్ పేజ్ కింద గొల్లపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి.. అక్కడ నుంచి తరలించాలని చూస్తోంది. ఫైనల్ ఫేస్ లో భాగంగా బొల్లపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటర్ కు నీళ్లు తరలించాలని చూస్తోంది.
* తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ..
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గాను 48 వేల ఎకరాల భూమిని సమీకరించాల్సి ఉంది. రెండు టన్నేళ్లు, 9 చోట్ల పంప్ హౌస్ ల నిర్మాణం అవసరం. కొన్నిచోట్ల గ్రావిటీ కాలువల నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టుకు తెలంగాణ( Telangana) నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇంకా తెలంగాణతో సరిహద్దు జలాల వివాదం తేలాల్సి ఉంది. 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటే.. ముందు ఆ నది యాజమాన్యం బోర్డు, సిడబ్ల్యూసి, జల్ శక్తి మంత్రి అధ్యక్షతన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఎఫెక్ట్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలి. అయితే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో.. పర్యావరణ అనుమతులు రాలేదని తెలుస్తోంది.