https://oktelugu.com/

Indian Rare Currency Note: ఈ నంబర్ నోట్ మీ దగ్గర ఉందా.. రూ.3 లక్షలు పొందే ఛాన్స్?

Indian Rare Currency Note: మనలో చాలామందికి ప్రాచీన వస్తువులను సేకరించడం అలవాటుగా ఉంటుంది. చాలామంది నాణేలను, కరెన్సీ నోట్లను సేకరిస్తూ ఉంటారు. ఈ అలవాటు వల్ల కొన్నిసార్లు సులభంగా లక్షల్లో సంపాదించే అవకాశం ఉంటుంది. 786 నంబర్ ఉన్న నోట్లకు మార్కెట్ లో ఊహించని స్థాయిలో డిమాండ్ ఉంది. ఎవరైతే ఈ నోట్లను కలిగి ఉంటారో వాళ్లు సులభంగా 3 లక్షల రూపాయల రూపాయలను సొంతం చేసుకోవచ్చు. 786 సిరీస్ కలిగిన నోట్లు మీ దగ్గర […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 2, 2021 / 11:00 AM IST
    Follow us on

    Indian Rare Currency Note: మనలో చాలామందికి ప్రాచీన వస్తువులను సేకరించడం అలవాటుగా ఉంటుంది. చాలామంది నాణేలను, కరెన్సీ నోట్లను సేకరిస్తూ ఉంటారు. ఈ అలవాటు వల్ల కొన్నిసార్లు సులభంగా లక్షల్లో సంపాదించే అవకాశం ఉంటుంది. 786 నంబర్ ఉన్న నోట్లకు మార్కెట్ లో ఊహించని స్థాయిలో డిమాండ్ ఉంది. ఎవరైతే ఈ నోట్లను కలిగి ఉంటారో వాళ్లు సులభంగా 3 లక్షల రూపాయల రూపాయలను సొంతం చేసుకోవచ్చు.

    786 సిరీస్ కలిగిన నోట్లు మీ దగ్గర ఎక్కువ సంఖ్యలో ఉంటే మరింత ఎక్కువ మొత్తం పొందే అవకాశం అయితే ఉంటుంది. 5, 10, 20, 50, 100, 500 ఇలా ఏ నోటు అయినా ఆ నోటుపై 786 నంబర్ సిరీస్ ఉంటే సులభంగా లక్షాధికారి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎన్నో వెబ్ సైట్ల ద్వారా ఈ నోట్లను సులభంగా విక్రయించే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది ప్రజలకు మతపరమైన విశ్వాసాలతో పాటు జ్యోతిష్యపరమైన విశ్వాసాలు సైతం ఉంటాయనే సంగతి తెలిసిందే.

    చాలామంది 786 నంబర్ ను లక్కీ నంబర్ గా భావించే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది ఈ నోటును పవిత్రమైన నోటుగా కూడా భావిస్తారు. ఈ నోటును విక్రయించాలనుకుంటే మొదట www.ebay.com వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. అందులో హోమ్ పేజీలో కొత్త రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి విక్రేతగా నమోదు చేసుకుని విక్రయించాలనుకున్న నోటును ఫోటో తీసి వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి.

    ఈబే ఆ ప్రకటనను పాత నాణేలు, నోట్లను కొనుగోలు చేయడం కోసం ఉపయోగించే కొనుగోలుదారులకు నోటిఫై చేస్తుంది. అయితే ఆన్ లైన్ ద్వారా పాత నాణేలు, నోట్ల విషయంలో కొన్నిసార్లు మోసపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమతంగా ఉండాలి.