RBI Currency note security features: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) జారీ చేసే నోట్లనే భారత దేశ ప్రజలు వాడుతూ ఉంటారు. ఈ బ్యాంక్ దారి చేసిన ప్రతి నోటు కీలకంగా ఉంటుంది. ప్రతి నోటుపై కొన్ని రకాల నెంబర్లు, గుర్తులు, కలర్స్, ఫోటోలు ఉంటాయి. అయితే మనీ ట్రాన్సాక్షన్ విషయంలో ప్రతి నోటును మార్చుకుంటూ ఉంటాము. కానీ ఆ నోటు ఎలా తయారు చేస్తారు? ఆ లోటుపై ఏముంటుంది? అనే విషయాలు పెద్దగా పట్టించుకోరు. అయితే ఈ నోటుపై చివరకు కొన్ని గీతలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి నల్ల రంగులో ఉంటాయి. చాలామంది ఈ గీతలను ఇప్పటికే చూసి ఉంటారు. కానీ అవి ఎందుకు ఏర్పాటు చేశారు? ఆ గీతల వల్ల ఎవరికి ఉపయోగం? అనే విషయం గురించి తక్కువ మంది ఆలోచిస్తారు. అసలు అవి ఎవరికోసం ఏర్పాటు చేశారో తెలుసా?
Also Read: పని చేయని ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు తొలగించ కూడదు.. వారికి రాజ్యాంగం కల్పించిన రక్షణ అంత బలమైనాదా?
ప్రతి మనిషికి ఉన్న అవయవాళ్లలో కళ్ళు కూడా ఒకటి. ఒకసారి కళ్ళు మూసుకుంటే ప్రపంచమే చీకటిగా మారుతుంది. అందువల్ల కళ్ళను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని అంటూ ఉంటారు. కళ్ళు ఉన్నవారు అన్ని చూడగలుగుతారు. కానీ కళ్ళు లేని వారు ఎలాంటి దృశ్యాలను చూడలేక పోతారు. కానీ వారి కోసం ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేశారు. నేటి కాలంలో కళ్ళు లేని వారు సైతం పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వీరికి మనీ ట్రాన్సాక్షన్ విషయంలో ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఏ నోటు ఎంత? అని కనుక్కుంటారు.
ఇలాంటి వారి కోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నోటుపై ఈ నల్లగీతలను ఏర్పాటు చేసింది. ఈ నల్ల గీతలు కలర్లో కాకుండా.. వాటిని టచ్ చేస్తే ప్రత్యేకంగా ఏర్పడే విధంగా ఉంచుతారు. ఉదాహరణకు ఒక నోటుపై ఐదు నల్ల జీతాలు ఉంటే చేతితో తాగితే అవి ప్రత్యేకంగా టచ్ చేసినట్టు అనిపిస్తుంది. అలా కళ్ళు లేని వారి కోసం ఈ గీతను ఏర్పాటు చేసి.. అది ఏ నోటో వారు గుర్తించు కోగలిగే విధంగా ఉంచారు. ఉదాహరణకు రూ. 500 నోటు ఉంటే దానిపై ఐదు నల్ల గీతలు ఉంటాయి. అంటే ఈ గీతలు రెండు వేరే, మరో రెండు దూరంగా ఉండి.. మధ్యలో ఒకటి ఉంటుంది. దీనిని వారు రూ. 500 అని గుర్తిస్తారు. అలాగే రూ. 100 నోటుపై రెండు, రెండు వేరువేరుగా గీతలు ఉంటాయి. ఇలా ఉన్న దానిని 100 రూపాయలు అని గుర్తిస్తారు.
Also Read: ఆత్మనిర్భర్ భారత్.. ఇక సొంత యుద్ధ విమానాల తయారీ!
ఈ విధంగా ప్రతి నోటుకు వారు కొన్ని గుర్తులు ఉంచుకొని అది ఏ నోటో తెలుసుకుంటారు. అలా పెద్దపెద్ద ట్రాన్సాక్షన్ కూడా జరుపుతూ ఉంటారు. ఇలా కళ్ళు లేని వారే మనీ నోటును గుర్తించినప్పుడు.. కళ్ళు ఉన్నవారు కచ్చితంగా అది నకిలీ నోటా? మంచి నోట? అనేది తెలుసుకోవాలి. లేకుంటే తీవ్ర అవస్థలకు గురవుతారు. ఎందుకంటే నేటి కాలంలో ఫేక్ నోట్స్ బయటకు వస్తున్నాయి. వీటి విషయంలో ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. అయినా వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.