చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు చాలా మంది పవన్ ను ఇప్టపడుతుంటారు. ఇండియన్ క్రికెట్ టీమ్ లో కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. యంగ్ క్రికెటర్ హనుమ విహారి సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ పై తన ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. ప్రస్తుతం ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ తో బిజీగా ఉన్న హనుమ తాజాగా తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ తో నేనే దిగిన ఫొటో ఇది. ఆరేళ్ల క్రితం ఈ పొటో దిగాను. నాకు ఇష్టమైన నటుడు, ఆదర్శంగా నిలిచే వ్యక్తి. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ హనుమ విహారి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.