India UK FTA Cars : భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఒక సానుకూల పరిణామమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా, బీఎండబ్య్లూ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. అయితే, ఈ ఒప్పందం వల్ల దేశంలో లగ్జరీ కార్ల ధరలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ఆ కంపెనీలు స్పష్టం చేశాయి. గత వారం భారత్, బ్రిటన్లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ద్వారా 99 శాతం భారతీయ ఎగుమతులపై సుంకాలు తగ్గుతాయి. అలాగే, బ్రిటిష్ కంపెనీలకు విస్కీ, కార్లు, ఇతర ఉత్పత్తులను మనదేశానికి ఎగుమతి చేయడం సులభమవుతుంది. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేసి 120 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్యం 60 బిలియన్ డాలర్లుగా ఉంది.
Also Read : ఇది మామూలు ఆఫర్ కాదు.. ఏకంగా రూ.90లక్షల తక్కువకే రోల్స్ రాయిస్, జాగ్వార్
భారత్ తన సెన్సెటివ్ రంగాలను రక్షించుకునేందుకు ఒప్పందంలో తగిన రక్షణ చర్యలను చేర్చింది. వాహన రంగంలో దిగుమతి సుంకాలు 10-15 సంవత్సరాలలోపు తగ్గించబడతాయి. బ్రిటన్ నుంచి పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వాహనాల దిగుమతిపై సుంక రాయితీ ముందుగా నిర్ణయించిన కోటాకు మాత్రమే పరిమితం అయింది. మెర్సిడెస్-బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ. ఒక మల్టి నేషనల్ కంపెనీగా మేము ఎల్లప్పుడూ స్వేచ్ఛా వాణిజ్యాన్ని సమర్థించాము. ఇది మెరుగైన వృద్ధికి సహాయపడుతుందని మేము భావిస్తున్నాము. భారత్-బ్రిటన్ ఒప్పందం, భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చల కారణంగా కార్ల ధరలు తగ్గుతాయని ఆశలు ఉన్నాయని ఆయన అన్నారు.
కార్ల ధరలు ఎంత తగ్గుతాయి?
భారతదేశంలో పరిశ్రమ విక్రయించే కార్లలో దాదాపు 95 శాతం సీకేడీ (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూపంలో ఉన్నాయి. దీని అర్థం ఈ రోజు కూడా కేవలం 15-16 శాతం ట్యాక్స్ మాత్రమే ఉంది. కాబట్టి, FTAతో కూడా ధరలలో భారీ తగ్గింపు ఉంటుందని ఆశించడం సరికాదని సంతోష్ అభిప్రాయపడ్డారు.
ఒప్పందం వల్ల ఏమి ప్రయోజనం?
బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో విక్రమ్ పావా మాట్లాడుతూ.. మా కంపెనీ వాణిజ్య అవరోధాల తగ్గింపును సమర్థిస్తుంది. ఇది ఆర్థిక వృద్ధితో పాటు వినియోగదారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు. భారత్-బ్రిటన్ FTA ఒక చారిత్రాత్మక ఒప్పందంగా కనిపిస్తోంది. ఇందులో వస్తువులు, సేవలు, రవాణా ఉన్నాయి.
Also Read : ఇది మామూలు ఆఫర్ కాదు.. ఏకంగా రూ.90లక్షల తక్కువకే రోల్స్ రాయిస్, జాగ్వార్