Luxury Cars : రోల్స్ రాయిస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, మెక్‌లారెన్, బెంట్లీ వంటి లగ్జరీ కార్లను ఇక మీదట తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. వీటి ధరలు ఎంత తక్కువగా ఉండబోతున్నాయో తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఈ కార్ల మీద ఏకంగా 80-90 లక్షల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు.
భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement-FTA) కుదిరింది. దీని ద్వారా బ్రిటన్‌లో తయారైన కార్లను భారతదేశానికి దిగుమతి చేసుకోవడం ఇక మీద ఈజీ కానుంది. అంతేకాకుండా, వాటిపై దిగుమతి సుంకం కూడా భారీగా తగ్గనుంది. ఫలితంగా ఈ లగ్జరీ కార్ల ధరలు గణనీయంగా తగ్గుతాయి.
Also Read : మహీంద్రా మెగా సీక్రెట్ ప్లాన్.. ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని రకాల కార్లు!
ప్రస్తుతం బ్రిటన్ నుండి దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లపై భారతదేశంలో 100 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. అయితే, FTA ప్రకారం ఈ దిగుమతి సుంకాన్ని ఏకంగా 10 శాతానికి తగ్గించారు. దీనివల్ల ఇప్పుడు ఒక లగ్జరీ కారు ధర రూ.2 కోట్లు ఉంటే, FTA తర్వాత దాని ధర కేవలం రూ.1 కోటి 10 లక్షలకు చేరుకుంటుంది. ఈ విధంగా వినియోగదారులకు దాదాపు రూ.90 లక్షల వరకు ఆదా అవుతుంది. దిగుమతి సుంకం తగ్గడం వల్ల దేశంలో లగ్జరీ కార్ల వినియోగం పెరుగుతుంది. రోల్స్ రాయిస్, జాగ్వార్ వంటి కంపెనీల అమ్మకాలు పెరిగి లాభపడతాయి.
FTA కేవలం బ్రిటన్ కార్ల కంపెనీలకే లాభం చేకూర్చదు. ఇక్కడి టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలకు కూడా బ్రిటన్ మార్కెట్లలో సులభంగా ప్రవేశం లభిస్తుంది. అంతేకాకుండా, ఈ కంపెనీల కార్లకు మంచి సేఫ్టీ రేటింగ్ ఉండటం వల్ల అక్కడ వాటి అమ్మకాలు పెంచుకోవడానికి సహాయపడుతుంది. ఈ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను కూడా మంచి ధరలకు బ్రిటన్ మార్కెట్‌లో విక్రయించవచ్చు.
పూర్తిగా తయారైన యూనిట్ల రూపంలో దిగుమతి చేసుకునే కార్లపై పన్ను రేటును భారత్ సున్నా చేసింది. అయితే, ఈ నియమం కింద ఒక నిర్దిష్ట పరిమితిలో మాత్రమే పూర్తిగా తయారైన కార్లను దిగుమతి చేసుకోగలరు. ఈ ఒప్పందం తర్వాత భారతదేశంలో రోల్స్ రాయిస్, బెంట్లీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్, లోటస్, ఆస్టన్ మార్టిన్, మెక్‌లారెన్ కార్లను తీసుకురావడం సులభం అవుతుంది. అలాగే, BSA, నార్టన్, ట్రయంఫ్ వంటి బైక్స్ కూడా భారతదేశానికి తక్కువ ధరకే రానున్నాయి.