Homeబిజినెస్Electric Scooters Growth India 2030: భారత్ లో ఇక బైకులు కనిపించవు.. వచ్చే...

Electric Scooters Growth India 2030: భారత్ లో ఇక బైకులు కనిపించవు.. వచ్చే రోజుల్లో జరిగేది అదే

Electric Scooters Growth India 2030: ఒకప్పుడు కాలినడక.. ఆ తర్వాత సైకిల్.. స్కూటర్.. బైక్.. కారు.. హెలికాప్టర్.. విమానం.. ఇదిగో ఇలా సాగుతోంది మనిషి ప్రయాణ సాధనల వాడకం. సైకిల్ అనేది ఒకప్పుడు స్టేటస్ సింబల్ గా ఉండేది. కాల అనుగుణంగా బైక్ అనేది అవసరం గా మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో బైక్ అనేది తప్పనిసరి అయిపోయింది.

కంపెనీలు భారీగా పుట్టుకు రావడం.. కొత్త కొత్త సదుపాయాలతో ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తీసుకురావడంతో.. వాటి కొనుగోలు విపరీతంగా పెరిగిపోయింది. హీరో, హోండా, టీవీఎస్ వంటి కంపెనీలు ద్విచక్ర వాహనాల తయారీలో అగ్రగామి సంస్థలు గా ఉన్నాయి. ఈ కంపెనీలు ప్రస్తుతం మార్కెట్ అవసరాలను తగ్గట్టుగా కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మనదేశంలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి.. వారి అభిరుచికి తగ్గట్టుగానే కంపెనీలు మోడల్స్ తయారు చేస్తున్నాయి.

ఇటీవల కాలంలో యుద్ధాలు పెరగడం.. చమురు డిమాండ్ అధికం కావడం.. పెట్రోల్ ధరల్లో స్థిరత్వం లేకపోవడంతో చాలామంది ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద దృష్టి పెడుతున్నారు. కంపెనీలు కూడా భవిష్యత్తు కాలాన్ని ముందుగానే ఊహించి ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనాల సెగ్మెంట్లో నెంబర్ వన్ సంస్థలు బైక్ల కంటే ఎక్కువగా స్కూటర్లను తయారు చేస్తున్నాయి. ఈ స్కూటర్లలో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ ఎక్కువగా చేస్తున్నాయి. దీనివల్ల టూవీలర్ మార్కెట్లో అభ్యర్థమైన మార్పులు వస్తాయని ఈక్వేర్స్ సెక్యూరిటీ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ విలన్చిన వివరాల ప్రకారం వచ్చే పది సంవత్సరాల కాలంలో స్కూటర్ల సంఖ్య బైకుల సంఖ్యలో మించి పోతుందట. ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు.. అర్బనైజేషన్.. మహిళా డ్రైవర్ల సంఖ్య పెరగడం వల్ల స్కూటర్ల తయారీ అధికమవుతుందట.

2030 సంవత్సరం నాటికి ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ల వాటా 38 శాతానికి.. 2040 నాటికి 80 శాతానికి చేరుతుందని తెలుస్తోంది. సౌకర్యానికి సౌకర్యం.. తక్కువ నిర్వహణ.. బైకులతో పోల్చి చూస్తే సరదాగా డ్రైవ్ చేయడం వంటి వాటి వల్ల స్కూటర్ల అమ్మకాలు దూసుకుపోతాయని ఈక్విరస్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. అంతేకాదు పార్కింగ్ విషయంలో కూడా బైక్ తో పోల్చి చూస్తే స్కూటర్లను సులువుగా చేయవచ్చని.. హ్యాండిల్ చేయడం కూడా సులభమని.. అందువల్లే కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version