Best Smartphone Under 35000: మిడిల్ క్లాస్ పీపుల్స్ మొబైల్ కొనాలంటే ముందుగా ఆలోచించేది Realme ఫోన్లో గురించే. ఎందుకంటే ఇది అందుబాటు ధరలో ఉండి ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా రోజువారి వినియోగదారులతో పాటు యూత్ కు కన్వీనెంట్ గా ఉండడంతో చాలామంది ఈ ఫోన్ల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీరికి అనుగుణంగా ఈ కంపెనీ కొత్త మొబైల్స్ ఎప్పుడు మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా 2026 సంవత్సరం జనవరిలో రియల్ మీ 16 అనే మొబైల్ లో తీసుకువచ్చారు అయితే ఈ సిరీస్లో 16 ప్రో, 16 ప్రో ప్లస్ వంటి మొబైల్ కూడా ఉన్నాయి. కానీ ఎక్కువగా రియల్ మీ 16 గురించి చర్చించుకుంటున్నారు. అందుకు కారణం ఇందులో ఉండే ఫీచర్స్ అని అనుకోవచ్చు. ఇంతకీ ఇందులో ఉండే ఫీచర్స్ తో పాటు బ్యాటరీ వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం..
ప్రస్తుత కాలంలో మంచి ఫీచర్స్ కలిగిన మొబైల్ ధర రూ.20,000 లకు పై మాటే అని చెప్పవచ్చు. అయితే మిడిల్ క్లాస్ పీపుల్స్ కొన్ని విధంగా మార్కెట్లోకి వచ్చిన రియల్ మీ మొబైల్ ధర రూ.35,000 లోపు కొనుగోలు చేయవచ్చు. దీని ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.31,999 తో ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ రోజువారి వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండే ఫీచర్స్ హైలెట్గా నిలుస్తున్నాయి.
ఈ మొబైల్ లో 6.78 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఫుల్ హెచ్డి ప్లస్ Resolution తో పని చేసే ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్ ను అమర్చారు. 8 కోర్ సిపియు తో పనిచేసే ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత సాఫ్ట్వేర్ ను అమర్చారు. ఈ మొబైల్ లో కెమెరా పని తీరు ప్రత్యేకంగా అని చెప్పవచ్చు. ఇందులో 200 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. అలాగే 8 mp అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది.50 MP ఫ్రంట్ కెమెరాతోపాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. దీంతో సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఈ కెమెరా అద్భుతంగా పనిచేస్తుంది.
రియల్ మీ 16 మొబైల్ లో బ్యాటరీ వ్యవస్థ బలంగానే ఉంది. ఇందులో 7000 mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది. వీటితోపాటు వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి ఫీచర్లు అదనపు సౌకర్యాలను అందిస్తాయి. అయితే రియల్ మీ 16 తర్వాత రియల్ మీ 16 ప్రో, 16 ప్రో ప్లస్ వంటి మొబైల్స్ వచ్చినప్పటికీ రియల్ మీ 16 కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే బ్యాటరీ వ్యవస్థ బలంగా ఉండడంతో పాటు రూ.35,000 లోపే ధర ఉండడం దీనికి కలిసి వస్తుంది.