Dasara 2026 Movies: ఇండస్ట్రీ లో పండగ వాతావరణం వచ్చిందంటే చాలు సినిమాల సందడి మొదలవుతుంది. కారణం ఏంటంటే పండక్కి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఒకే చోట కలుసుకుంటారు. దాని వల్ల ఫ్యామిలీ మొత్తం ఆహ్లాదంగా గడపడానికి ఇష్టపడతారు.తద్వారా అందరు సినిమాలను చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దాని కోసమే పండగ సీజన్లో మంచి సినిమాలు రిలీజ్ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే దసరా పండగకి చాలా పెద్ద సినిమాలను రిలీజ్ చేసి దానిని క్యాచ్ చేసుకోవాలని చాలామంది చూస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ దసరాకి మాత్రం చాలా పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా రజనీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్ లో వస్తున్న ‘జైలర్ 2’ సినిమా దసరాకి రిలీజ్ అవుతుంది. ఇక దాంతోపాటుగా చిరంజీవి విశ్వంభర సినిమా కూడా దసరాకి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక రెండు సినిమాలతో పాటు నాని హీరోగా వస్తున్న ‘ప్యారడైజ్’ సినిమాని కూడా దసరా బరిలో నిలపాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు ప్రేక్షకులందరిలో ఎలాంటి గుర్తింపును తెచ్చుకోవాలనుకుంటున్నారు అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమాలు రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా బరిలోకి దిగబోతున్నాయి అనే వార్తలైతే వస్తున్నాయి. దసరాకి ఇంకా మూడు నెలల సమయం ఉండడంతో ఈలోపు చిన్న చిన్న సినిమాలను సైతం రంగం సిద్ధం చేసి బరిలో దింపాలనే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నారు. ఈ సినిమాలను బరిలో దింపి సక్సెస్ ఫుల్ గా నిలుపుతారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ లను సాధించడం లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన లెనిన్ సినిమాతో ఇండస్ట్రీ కొంచెం ఊపిరి పీల్చుకుంది. ఈ మూడు రోజులపాటు ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…
