Homeబిజినెస్Yamaha FZ Blue Flex: ఇప్పుడు Yamaha నుంచి కూడా.. ఫ్లెక్సీ ఫ్యూయల్.. ధర ఎంతంటే..

Yamaha FZ Blue Flex: ఇప్పుడు Yamaha నుంచి కూడా.. ఫ్లెక్సీ ఫ్యూయల్.. ధర ఎంతంటే..

Yamaha FZ Blue Flex: పెట్రోల్ ధరలతో పాటు వాతావరణ కాలుష్యం నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్లెక్సీ వాహనాలు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే Hero కంపెనీ నుంచి ఇప్పటికే స్ల్పెండర్ ఫ్లెక్సీ వెహికల్ ను తీసుకొచ్చార. ఇప్పుడు యమాహా మోటార్ ఇండియా కూడా తన మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ ‘యామాహా ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్’ (Yamaha FZ Blue Flex) ను అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియంతో పాటు స్టైలిష్ బైక్ కొనేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా ఉండనుంది. ఈ బైక్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

Yamaha FZ Blue Flex బైక్ లో E20 (20% ఇథనాల్) నుంచి E85 (85% ఇథనాల్) వరకు కలిపిన ఇథనాల్ బ్లెండెడ్ ఇంధనంతో సులభంగా నడుస్తుంది. దీనివల్ల పెట్రోల్‌పై ఆధారపడటం తగ్గడమే కాకుండా, కర్బన ఉద్గారాలు భారీగా తగ్గి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. రోజువారీ వాడకంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వేర్వేరు మోతాదుల ఇథనాల్ మిశ్రమాలను తట్టుకునేలా దీని ఇంజన్‌ను ప్రత్యేకంగా రీ-ఇంజనీరింగ్ చేశారు.

ఈ బైక్ లో 149cc, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ను అమర్చారు. అయితే, ఫ్లెక్స్-ఫ్యూయల్ సాంకేతికత కారణంగా సాధారణ పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే దీని పవర్‌లో స్వల్ప మార్పులు వచ్చాయి. ఈ ఇంజన్ 11.3 bhp పవర్‌ను, 12.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.

లుక్స్ పరంగా ఈ బైక్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాపులర్ ఎఫ్‌జెడ్ సిరీస్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో ఫుల్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, ఏరోడైనమిక్ బాడీవర్క్, కాంపాక్ట్ ఎగ్జాస్ట్, సౌకర్యవంతమైన సింగిల్ పీస్ సీటును అందించారు. ఫీచర్ల విషయానికి వస్తే.. నెగటివ్ LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. అయితే, ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ లేదా ట్రాక్షన్ కంట్రోల్ వంటి హై-టెక్ ఫీచర్లు ఉండవు.

ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం దీని ధరను రూ. 1,24,240 గా కంపెనీ నిర్ణయించింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించాలనే భారత ప్రభుత్వ బయో-ఫ్యూయల్ విధానాలకు అనుగుణంగా యామాహా ఈ బైక్‌ను తీసుకువచ్చింది.

భద్రత కోసం ఈ బైక్‌లో సింగిల్-ఛానల్ ABS తో పాటు ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను అందించారు. తొలి దశలో ఈ బైక్ దేశంలోని ఇథనాల్ ఇంధన లభ్యత ఎక్కువగా ఉన్న ఆరు ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని యామాహా ‘బ్లూ స్క్వేర్’ డీలర్‌షిప్‌లలో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version