RCB : బీసీసీఐ తెరవెనుక పాత్ర పోషిస్తున్నప్పటికీ.. ఐపీఎల్ నిర్వహణలో నిర్వాహ కమిటీదే తుది నిర్ణయంగా సాగుతోంది. ఇక ఐపీఎల్ ఇప్పటివరకు 17 ఎడిషన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 18 వ ఎడిషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చెరి ఐదు సార్లు ఐపీఎల్ విజేతలుగా నిలిచాయి. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లుగా ఇవి పేరు తెచ్చుకున్నాయి. ఇక ప్రస్తుత సీజన్లో పాయింట్ల పట్టికలో ముంబై జట్టు ఆరవ స్థానంలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిదవ స్థానంలో కొనసాగుతోంది.. ఈసారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కింగ్స్ 11 పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రెండవ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మూడవ స్థానంలో కొనసాగుతోంది..
Also Read : IPL లో అద్భుతం.. రెండు చేతులతో బౌలింగ్.. ఒక వికెట్ కూడా..
ఆటగాళ్లు సందడి చేశారు..
ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (MI vs RCB) తలపడనున్నాయి.. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు ఆటగాళ్లు మైదానంలో ముమ్మరంగా సాధన చేస్తున్నారు.. ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆన్లైన్ గ్రాసరీ సంస్థ బిగ్ బాస్కెట్ (Big basket) బెంగళూరులోని చిన్నారులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. అందులో గెలిచిన విజేతలకు బెంగళూరు ఐపిఎల్ టీం లోని క్రికెటర్ల ద్వారా బహుమతులు అందించింది. ఈ కార్యక్రమాన్ని బిగ్ బాస్కెట్ సంస్థ ఘనంగా నిర్వహించింది. దానికి సంబంధించిన వీడియోను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది.ఈ సందర్భంగా అభిమానులు, చిన్నపిల్లలతో బెంగళూరు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), కృణాల్ పాండ్యా(krunal Pandya), దేవదత్ పడిక్కల్ (devadat padikkal) సందడి చేశారు.. వర్ధమాన యువ క్రికెటర్లతో మాటా మంతీ నిర్వహించారు. వారితో సెల్ఫీలు దిగారు. ఆటోగ్రాఫ్ లు కూడా ఇచ్చారు. ఇక అదే ప్రాంతంలో ఉన్న చిన్న పిల్లలతో సందడి చేశారు. వారితో సరదాగా ముచ్చటించారు. ఆ తర్వాత వారితో కలిసి ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో.. ఫోటోలు సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తున్నాయి.. మిగతా జట్ల కంటే.. బెంగళూరు పీఆర్ టీమ్ బలంగా పనిచేస్తుంది. అందువల్లే బెంగళూరు జట్టు నిర్వహించే ఏ కార్యక్రమాలైనా సరే బహుళ ప్రజాదరణ పొందుతుంటాయి. ” ఇది జీవితకాలంలో ఒకసారి మాత్రమే దక్కే అవకాశం. అలాంటి అవకాశాన్ని బిగ్ బాస్కెట్ కల్పించింది. బిగ్ బాస్కెట్ నిర్వహించిన పోటీలో విజేతలైన వారికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు బహుమతులు అందించారు. విరాట్ కోహ్లీతో.. మిగతా ఆటగాళ్లతో చిన్నారులు సందడి చేశారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ కార్యక్రమం ఆసాంతం అద్భుతంగా సాగింది. చిన్నారులకు సరికొత్త ఆనందాన్ని అందించిందని” బెంగళూరు క్రికెట్ జట్టు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పేర్కొంది.
–
A fantastic opportunity for kids to meet their cricket heroes, courtesy @bigbasket_com!
Big Basket held cricket tournaments in Bengaluru and rewarded talented young kids with an… pic.twitter.com/sE2DpQlTMp
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 4, 2025