Hyundai Exter micro SUV: నేటి కాలంలో బైకుల ధరలే దాదాపు పది లక్షల వరకు ఉన్నాయి. అటువంటిది కేవలం 5.79 లక్షల కే కారు వస్తోంది. అది కూడా ఎస్ యూవీ ఫెసిలిటీస్ తో అదరగొడుతోంది.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఏడు వేరియంట్లతో సత్తా చూపిస్తోంది. ఇంతకీ ఆ మోడల్ ఏంటి.. అందులో ఉన్న అదనపు సౌకర్యాలు.. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలపై ప్రత్యేక కథనం.
హ్యుందాయ్ కంపెనీకి తిరుగులేదు
ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీకి తిరుగులేదు. ఈ కంపెనీ ప్రస్తుతం కార్ల విక్రయాలలో దుమ్ము రేపుతోంది. మారుతి, టాటా, టయోటా కంపెనీలకు సవాల్ విసురుతోంది. ఇండియన్ రోడ్లకు అనుగుణంగా హ్యుందాయ్ ఈ మోడల్స్ రూపొందించింది. అయితే తక్కువ ధరలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ ఫెసిలిటీస్ అందించడంతో ఈ మోడల్ పై కొనుగోలుదారులకు ఆసక్తి ఏర్పడుతోంది. పైగా మిడిల్ క్లాస్ వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ మోడల్ రూపొందించినట్టు కనిపిస్తోంది. అద్భుతమైన ఏడు రంగులలో ఈ మోడల్ కార్లను హ్యుందాయ్ కంపెనీ రూపొందించింది. అందువల్లే గ్రాండియర్ లుక్ కనిపిస్తోంది.
ఎస్ యూవీ సెగ్మెంట్ లో..
హ్యుందాయ్ కంపెనీ తాజాగా suv సెగ్మెంట్లో ఎక్స్టర్ మైక్రో (Hyundai exter micro) అనే మోడల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర 5.79 లక్షలుగా పేర్కొంది. ఈ మోడల్ లో మాన్యువల్ ట్రాన్స్మిషన్.. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనే రెండు ఆప్షన్లను తీసుకువచ్చింది. పెట్రోల్, సిఎన్జి ఇంజన్ వేరియంట్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. డీలర్ షిప్ లో లేదా కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి 11, 000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.
ఏ ఫెసిలిటీస్ ఉన్నాయంటే..
ఈ కారులో 1.2 లీటర్ల బై ఫ్యూయల్ కప్ప పెట్రోల్ విత్ సిఎన్జి అందుబాటులో ఉంది.. ఇందులో మ్యానువల్ ట్రాన్స్మిషన్ సదుపాయం ఉంది.. ఇది డాష్ క్యామ్ సెటప్ లో లభిస్తుంది. ఆఫ్లైన్లో కూడా 300 వాయిస్ కమాండ్స్ పని చేస్తాయి. ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఉంటుంది. ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్ లభిస్తాయి. ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. టైర్ ప్రెజర్ మానిటర్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. హిల్ స్టార్ట్ అఫీస్ట్ కంట్రోల్ ఈ వాహనానికి ఉన్న ప్రధాన ప్రత్యేకత..
ధరల శ్రేణి ఎలా ఉందంటే
ఈ మోడల్ లో హెచ్ ఎక్స్ 2 వేరియంట్ 6,99,900, హెచ్ ఎక్స్ 3 7,43,900, హెచ్ ఎక్స్ 4 8,26,900, హెచ్ ఎక్స్ 6 8,93,900, హెచ్ ఎక్స్8 9,40,900 ధరలో లభిస్తాయి.
1.2 L కప్ప పెట్రోల్ ఇంజన్ టైపులో..
మ్యానువల్ ట్రాన్స్మిషన్ లభిస్తుంది. సదుపాయాలు కూడా 1.2 లీటర్ల బై ఫ్యూయల్ కప్ప పెట్రోల్ విత్ సిఎన్జి లో ఉన్నట్టుగానే ఉన్నాయి.. ఇందులో కూడా 7 వేరియంట్లు ఉన్నాయి. చూడగానే ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి.
ధరల శ్రేణి ఎలా ఉందంటే
హెచ్ ఎక్స్ 2 వేరియంట్ ధర 5,79,900, హెచ్ ఎక్స్ 3 6,23,900, హెచ్ ఎక్స్ 4 7,21,900, హెచ్ ఎక్స్ 6 7,94,900, హెచ్ ఎక్స్ 8 8,35,900 ధరలో లభిస్తాయి. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ విభాగంలో హెచ్ ఎక్స్ 3 6,90,900, హెచ్ ఎక్స్ ఫోర్ ప్లస్ 8,05,900, హెచ్ ఎక్స్ సిక్స్ 8,54,900, హెచ్ ఎక్స్8 9,07,900, హెచ్ ఎక్స్ 10 9,41,900 ధరలో లభిస్తాయి.
