Hundai Electric Car : దేశీయంగా Electrical Vehicle (EV) ల వినియోగం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కంపెనీలు కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ఎస్ యూవీల కంటే ఈవీల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో మిడిల్ క్లాప్ పీపుల్స్ కు ఇది అందనంత ఎత్తులో ఉంటోంది. దీంతో ఓ కంపెనీ ధరను తగ్గించి ఓ వాహనాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే వచ్చిన దానికి కొన్ని మార్పులు చేస్తూ కొత్త టెక్నాలజీని అమర్చనున్నారు. మరి ఆ కారు విశేషాలేంటో చూద్దాం..
దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ తనకంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. ఈ కంపెనీ ఇప్పటికే 5 ఈవీలను విక్రయిస్తోంది. ఇందులో ప్రారంభ ధర రూ.23.84 లక్షలతో ప్రారంభమై రూ.24.03 లక్షలతో విక్రయిస్తున్నారు. వీటిలో ఐయోనిక్ రూ.45.95లక్షల ప్రారంభ ధర ఉంది. ఈ ధరను చూసి వినియోగదారులు షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరకు కారును అందించాలని అనుకుంది. హ్యుందాయ్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన క్రెటా ను ఫేస్ లిప్ట్ ఆధారంగా హ్యుందాయ్ క్రెటా 2024 EVగా మార్చి మార్కెట్లోకి తీసుకురానున్నారు.
హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ 2024 EV కారు 45kWh బ్యాటరీని కలిగి ఉంది. దీనికి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 450 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని అంటున్నారు. ఈ ఏడాది చివరలో లేదా 2025 లో ఇది మార్కెట్లోకి రానుంది. దీనిని రూ.17 లక్షల ప్రారంభ ధరతో విక్రయించాలని నిర్ణయించారు. ఇందులో పనోరమిక్ సన్ రూప్, 8 స్పీకర్ బోస్ సౌండ్, వెంటిలెటేడ్ ఫ్రంట్ సీట్లు ఉండనున్నాయి. అలాగే 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఆకర్షించనున్నాయి.
గతంలో రిలీజ్ అయిన క్రెటా ఫేస్ లిప్ట్ వినియోగదారులను ఆకర్షించింది. దీనిని రూ.11 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఈవీని అందుబాటులోకి తీసుకురావడం ఆసక్తిగా మారింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో హ్యుందాయ్ తెచ్చే ఈ ఈవీని వినియోగదారులు కచ్చితంగా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.