Car Specification : కారు కొనాలనుకునేవారు ముందుగా డిజైన్ చూస్తారు. ఆ తరువాత ఫీచర్స్, మైలేజ్ చూసి చివరకు ధర విషయాన్ని పరిశీలిస్తారు. అయితే కారుకు సంబంధించిన కొన్ని స్పెషిఫికేషన్ తెలియజేయడానికి కొన్ని కంపెనీలు కారు వెనుకాల డోర్ పై రాస్తారు. వీటి ఆధారంగా అది ఎలాంటి కారో తెలిసిపోతుంది. అయితే ఈ కోడ్ కారు గురించి తెలిసిన వారికి మాత్రమే అర్థమవుతుంది. చాలా కార్లపై 4X4 అని రాసి ఉంటుంది. దీని అర్థం ఏంటి? దానిని ఎందుకు రాస్తారు? అని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. అదేంటంటే?
ఆటోమోబైల్ మార్కెట్లో విభిన్న మోడళ్ల వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వినియోగదారులు వారి అవసరాల నేపథ్యంలో తమకు కావాల్సిన వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. మహీంద్రా కంపెనికి చెందిన జీప్ ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే. ఇదే మోడళ్లో పలు వాహనాలు వచ్చాయి. లేటేస్టుగా థార్ జనాదరణ పొందింది. మహీంద్రా కార్లపై మాత్రమే కాకుండా SUV రేంజ్ ఉన్న కార్లపై 4X4 అని రాసి ఉంటుంది.
4X4 అంటే ఆ వాహనానికి ఉండే నాలుగు చక్రాలకు సమానంగా ఇంజిన్ సెట్ చేయబడింది అని అర్థం. అంటే కొన్ని వాహనాలకు ముందుభాగంలో లేదా వెనుక భాగంలో ఉండే చక్రాలకు మాత్రమే ఇంజిన్ ఉంటుంది. కానీ వీటికి మాత్రం నాలుగు చక్రాలకు ఇంజిన్ పనిచేస్తుందని అంటున్నారు. అయితే ఇలా ఎందుకు రాస్తారంటే.. కొండలపై, క్లిష్టమైన రోడ్లపై కూడా ఈ వాహనాలు నడపొచ్చు అని తెలియజేస్తారు. దీనిని భట్టి ఆయా ప్రాంతాల వారు.. ఆయా అవసరాలు ఉన్న వారు ఈ వాహనాలను కొనుగోలు చేస్తారు.