Mahindra Car Price : వినియోగదారులకు షాక్ ఇచ్చిన మహీంద్రా కార్ల కంపెనీ.. 

ఈ కంపెనీ తాజాగా వినియోగదారులకు షాక్ ఇచ్చింది. కొన్ని మోడళ్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Written By: Neelambaram, Updated On : January 26, 2024 3:46 pm

Mahindra Car Company

Follow us on

Mahindra Car Price :కార్ల దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎస్ యూవీ కార్లలో విభిన్న మోడల్ ను తీసుకొచ్చి సంచలనాలు సృష్టించింది. హైబ్రిడ్ ఇంజిన్లను కలిగి.. రేసు గుర్రంలా దూసుకుపోయే మహీంద్రా కార్లంటే వినియోగదారులు ఎక్కువగా లైక్ చేస్తారు. అయితే ఈ కంపెనీ తాజాగా వినియోగదారులకు షాక్ ఇచ్చింది. కొన్ని మోడళ్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో మహీంద్రా కారు కొనాలనుకునేవారు ధరలు పెరగడం చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఏ మోడల్ పై ఎంత ధర పెంచారో చూద్దాం..
మహీంద్రా నుంచి రిలీజ్ అయిన థార్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో అందరికీ తెలిసింది. ఈ మోడల్ కు ఎన్ని కార్లు పోటీ వచ్చినా థార్ కు ఉండే ప్రాధాన్యత తగ్గడం లేదు. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.10.98 లక్షలు ఉంది. టాప్ వేరియంట్ రూ.16.93 లక్షలకు అమ్మారు. ఇప్పుడు  ప్రారంభ ధరను  11.25 లక్షల వరకు పెంచి టాప్ ఎండింగ్ ను రూ.17.20 లక్షలతో విక్రయించనున్నారు. ఇదే మోడల్ ఇతర వేరియంట్ లో ఓవరాల్ గా రూ.23 వేల నుంచి రూ.35 వేల వరకు పెరిగింది.
మహీంద్రా XUV 700 AX7: ఈ మోడల్ పై మొత్తంగా రూ.57,000 గరిష్టంగా పెంచారు. దీంతో ప్రస్తుతం ఈ కారు 23.69 లక్షలతో విక్రయించనున్నారు. ఇందులో ప్రధానంగా ముందు సీట్ల తో వెంటిలేటర్లు, ORVM మెమరీ ఫంక్షన్ అందుబాటులో ఉంది. స్కార్పియో ఎన్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ రూ.34,000  నుంచి రూ.39,000 వరకు పెరిగింది. అలాగే స్కార్పియో ఆటోమేటిక్ వేరియంట్ రూ.17,000 నుంచి రూ.20,000 వరకు పెంచారు.
ప్రస్తుతం స్కార్పియో ధర రూ.13.60 లక్షల ధర ఉండగా దీనిని రూ.17.35 లక్షల వరకు పెంచారు. డీజిల్ వెర్షన్ మోడల్ రూ.39,000 వరకు పెంచారు.  డీజిల్ ఆటోమేటిక్ వెర్షన్ రూ.11,000 నుంచి రూ.26,000 వరకు పెంచారు. స్కార్పియో ఎన్ పెట్రోల్ మాన్యువల్ ధర రూ.34,000 నుంచి రూ.39,000 వరకు పెరిగింది. ఎన్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ను రూ.17,000 నుంచి రూ.20,000 వరకు పెంచారు. కాగా స్కార్పియో Z87 3WD డీజిల్ మాన్యువల్ పై ఎటువంటి మార్పులు లేవు.
అయితే మహీంద్రా కార్ల ధరలు పెరగడంతో పాటు కొన్నింటికి తగ్గించింది.  మహీంద్రా మరో మోడల్ XUV 700 ధర రూ.14.03 లక్షలు ఉండగా ప్రస్తుతం  రూ.13.99 లక్షలతో విక్రయించనుంది. మహీంద్రా XUV700 AS, AX 5 వేరియంట్ లు వరుసగా రూ.8,000 నుంచి రూ.16,000 వరకు తగ్గించారు.