https://oktelugu.com/

Hyundai Vs TATA: మార్కెట్‌ రేసులో.. టాటాకు డ్యాష్‌ ఇచ్చిన హ్యుందాయ్‌.. టాప్ ప్లేసుల్లో మార్పులివీ

గతేడాది ఇదే నెలతో పోలిస్తే రెండు కార్ల కంపెనీల విక్రయాల్లో స్వల్ప పెరుగుదల ఉంది. హ్యుందాయ్‌ విక్రయాలు 1%, టాటా మోటార్స్‌ 2% పెరిగాయి. 2024 మార్చిలో కడూ హ్యుందాయ్‌ నంబర్‌–2 రేసులో స్వల్ప ఆధిక్యం కనబర్చింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 8, 2024 / 05:02 PM IST

    Hyundai Vs TATA

    Follow us on

    Hyundai Vs TATA: భారతీయ ప్యాసింజర్‌ వాహనాల మార్కెట్‌ ప్రపంచంలోని అత్యంత పోటీ కార్‌ మార్కెట్‌లో ఒకటి. మారుతి సుజుకి ప్రతీనెల 40 శాతం కన్నా ఎక్కువ మార్కెట్‌ వాటాతో నంబర్‌ వన్‌గా కొనసాగుతోంది. రెండో స్థానం కోసం రేసు చాలాకాలంగా ఆసక్తికరంగా మారింది. హ్యుందాయ్‌ చాలాకాలంగా అమ్మకాల పరంగా రెండో స్థానంలో ఉంది. అయితే ఇటీల టాటామోటార్స్‌ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. టాటామోటార్స్‌ మెరుగైన నాణ్యత, పనితీరుతో కార్లనువిడుదల చేసింది. దీని కారణంగా వారి ఉత్పత్తుల శ్రేణి కూడా భారీగా పెరిగింది.

    రెండో స్థానంలో హ్యుందాయ్‌..
    ఇక హ్యుందాయ్‌ తన రెండవ స్థానాన్ని కోల్పోలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో హ్యుందాయ్‌ 50,201 కార్లను విక్రయించింది. అదే సమయంలో, టాటా మోటార్స్‌ గత నెలలో 47,883 వాహనాలను విక్రయించడం ద్వారా హ్యుందాయ్‌కి చాలా దగ్గరగా వచ్చింది.

    స్వల్ప పెరుగుదల…
    గతేడాది ఇదే నెలతో పోలిస్తే రెండు కార్ల కంపెనీల విక్రయాల్లో స్వల్ప పెరుగుదల ఉంది. హ్యుందాయ్‌ విక్రయాలు 1%, టాటా మోటార్స్‌ 2% పెరిగాయి. 2024 మార్చిలో కడూ హ్యుందాయ్‌ నంబర్‌–2 రేసులో స్వల్ప ఆధిక్యం కనబర్చింది. హ్యుందాయ్‌ 53,000 వాహనాలను విక్రయించగా, టాటా మోటార్స్‌ 50,110 వాహనాలను విక్రయించడంలో విజయవంతమైంది. అయితే, హ్యుందాయ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాల అధికారిక గణాంకాలను ఇంకా విడుదల చేయలేదు. టాటా మోటార్స్‌ మార్చిలో 6,364 ఎలక్ట్రిక్‌ వాహనాలను విక్రయించింది.

    ఇలా రెండు కార్లు మార్కెట్‌ రేసులో పోటీ పడుతున్నాయి. కొనుగోలుదారులు కూడా ఈ రెండు కార్ల కొనుగోలుకు పోటీ పడుతున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.