https://oktelugu.com/

Hanu Raghavapudi: హను రాఘవపూడి ఆ విషయం లో చాలా వీక్… మరి ప్రభాస్ పరిస్థితి ఏంటి..?

ప్రభాస్ సూపర్ హిట్ అందుకుంటాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి ప్రభాస్ అంటే యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం..

Written By:
  • Gopi
  • , Updated On : May 8, 2024 / 04:42 PM IST

    Hanu Raghavapudi is very weak in that matter

    Follow us on

    Hanu Raghavapudi: ప్రస్తుతం పాన్ ఇండియాలో ప్రభాస్ తన దూకుడు చూపిస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో రిలీజ్ చేయనన్ని పాన్ ఇండియా సినిమాలను రిలీజ్ చేసి ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే హను రాఘవపూడి డైరెక్షన్ లో కూడా నటించడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమా ‘పిరియాడికల్ లవ్ స్టోరీ’ గా తెరకెక్కుతుంది. హను రాఘవపూడి లవ్ స్టోరీస్ ను చాలా అద్భుతంగా తీస్తాడు అనే ఒక పేరు అయితే ఉంది. కానీ ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ ని అంత బాగా హ్యాండిల్ చేయలేడు అనే మరొక బ్యాడ్ నేమ్ కూడా ఉంది.

    మరి ఇలాంటి క్రమంలో ఈయనతో సినిమా చేసి ప్రభాస్ సూపర్ హిట్ అందుకుంటాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి ప్రభాస్ అంటే యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం.. ఆయన సినిమాలు కూడా యాక్షన్ కి స్కోప్ ఉన్న సినిమాలే ఎక్కువ విజయం సాధించాయి. కాబట్టి ఈ సినిమాలు లవ్ స్టోరీ గా వచ్చినప్పటికీ, యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం చాలా కీలకంగా ఉండాలి. అలా ఉంటేనే ప్రభాస్ రేంజ్ సక్సెస్ అయితే దక్కుతుంది.

    లేకపోతే మాత్రం ఈ సినిమా ఎంత బాగున్న ఆవరేజ్ గానే మిగిలిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక పాన్ ఇండియాలో ప్రభాస్ లాంటి నటుడు మరొకరు లేరు అనేది ఇప్పటివరకు ప్రూవ్ అవుతుంది. ఇకమీదట కూడా అలాగే తను నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగాలంటే మాత్రం ఇక రాబోయే మూడు నాలుగు సినిమాలతో వరుస సక్సెస్ లు సాధిస్తే అది ఈజీ అవుతుంది.

    లేకపోతే మాత్రం ప్రభాస్ మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తే బాగుంటుందంటూ హను రాఘవపూడి కి ఇప్పటికే ప్రభాస్ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు…మరి ఆయన ఈ సినిమాను ఎలా తీస్తాడో తెలియాలంటే మనం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…