Samantha: బాత్ టబ్ లో స్నానం చేస్తున్న సమంత… ఆ ప్రైవేట్ పిక్ డిలీట్ చేసిన స్టార్ లేడీ, కారణం?

కెరీర్లో దూసుకుపోతున్న సమంతకు మయోసైటిస్ రూపంలో బ్రేక్ పడింది. 2022 అక్టోబర్ లో సమంత తనకు అరుదైన మయోసైటిస్ సోకిన విషయం వెల్లడించింది.

Written By: S Reddy, Updated On : May 8, 2024 5:05 pm

samantha bathtub pics

Follow us on

Samantha: సమంత సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్ గా మారగా.. ఆమె తొలగించడం చర్చకు దారి తీసింది. సమంత సదరు ఫోటోల్లో కేవలం టవల్ చుట్టుకుని ఉంది. ఆమె స్నానాల గదిలో ఉన్న ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ సంగతి ఏమిటో చూద్దాం… సమంత టాలీవుడ్ స్టార్ లేడీ. ఆమె ఫేమ్ ఇండియా వైడ్ పాకింది. 2010లో వెండితెరకు పరిచయమైన సమంత కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. స్టార్స్ తో జతకడుతూ హవా సాగించింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సైతం విజయాలు అందుకుంది. సమంతకు ది ఫ్యామిలీ మ్యాన్ 2, పుష్ప ప్రాజెక్ట్స్ నార్త్ లో ఫేమ్ తెచ్చాయి.

కెరీర్లో దూసుకుపోతున్న సమంతకు మయోసైటిస్ రూపంలో బ్రేక్ పడింది. 2022 అక్టోబర్ లో సమంత తనకు అరుదైన మయోసైటిస్ సోకిన విషయం వెల్లడించింది. ఏడాదిన్నర కాలంగా సమంత ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది. ఆమె అనేక దేశాలను సందర్శించారు. చికిత్సకు అందుబాటులో ఉన్న అన్ని రకాల పద్ధతులు పాటించారు. తాజాగా ఆమె ఇన్ఫ్రారెడ్ సాన థెరపీ తీసుకున్నారు. దీని వలన కలిగియే ప్రయోజనాలు వెల్లడించింది.

ఇన్ఫ్రారెడ్ థెరపీ తీసుకోవడం ద్వారా… కండరాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది, జీర్ణక్రియ మెరుగు అవుతుంది. శరీరంలోని విషతుల్యాలు బయటకు పోతాయి. కండరాల నొప్పి తగ్గుతుంది. ఫ్లెక్సిబులిటీ పెరుగుతుంది. చర్మం కాంతి సంతరించుకుంటుందని… పలు ప్రయోజనాలు ఉంటాయని సమంత రాసుకొచ్చింది. సమంత ఈ థెరపీ గురించి చెబుతూ షేర్ చేసిన ఫోటోల్లో కేవలం టవల్ తో ఉన్నారు.

samantha bathtub pics goes viral

దాంతో సదరు ఫోటోలు సమంత డిలీట్ చేసింది. కానీ అప్పటికే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమంత ఆ ఫోటోలు డిలీట్ చేయడానికి కారణం ఏమిటో తెలియదు. ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే… ఓ ఏడాది పాటు కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయకుండా సమంత రెస్ట్ తీసుకుంది. ఇటీవల తన బర్త్ డే కానుకగా ఓ మూవీ ప్రకటించింది. విశేషం ఏమిటంటే ఈ చిత్రంతో సమంత నిర్మాతగా కూడా మారుతుంది.

సమంత కొత్త చిత్రం టైటిల్ మా ఇంటి బంగారం. ఎర్ర చీర ధరించి చేతిలో గన్ను పట్టుకొని సీరియస్ లుక్ లో సమంత దర్శనం ఇచ్చింది. అలాగే వరుణ్ ధావన్ కి జంటగా నటించిన యాక్షన్ సిరీస్ హనీ బన్నీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఇది హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కి ఇంగ్లీష్ వెర్షన్. త్వరలో హనీ బన్నీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. అల్లు అర్జున్-అట్లీ కాంబోలో ఓ చిత్రం కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తుండగా.. సమంత హీరోయిన్ గా ఎంపికయ్యారని అంటున్నారు.