Roja and Srikanth: సినీ ఇండస్ట్రీ లో నటీనటులు బంధాలు, బంధుత్వాలు, వయస్సు వంటి వాటిని పూర్తిగా మర్చిపోయి కెమెరా ముందుకు రావాలి, కథకు అవసరమైతే ఎలాంటి పాత్ర ని అయినా చెయ్యాలి, అలాంటి వాళ్ళే ఈ ఇండస్ట్రీ లో నెగ్గుకుని రాగలరు. ఉదాహరణకు శ్రీదేవి ని తీసుకుందాం. అప్పట్లో ఈమె ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఇలా ఎంతో మంది హీరోల సినిమాల్లో ఈమె బాలనటిగా నటించింది. మళ్ళీ ఈమెనే పెద్దయ్యాక వాళ్ళ సరసన హీరోయిన్ గా కూడా నటించింది. ఇలా చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి సీనియర్ హీరో శ్రీకాంత్, రోజా జంట కూడా నిల్చింది. వీళ్లిద్దరు రీసెంట్ గానే ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే బోనాలు స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం లో వీళ్లిద్దరు ఎన్నో విశేషాలను పంచుకున్నారు. అవేంటో చూద్దాం.
శ్రీకాంత్(Srikanth),రోజా(Roja Selvamani) కలిసి గతం లో అన్నాచెల్లెలుగా ఒక సినిమాలో నటించారట, అప్పటి నుండి శ్రీకాంత్ ని రోజా అన్నయ్య అని పిలిచేదట. కానీ భవిష్యత్తులో వీళ్ళు కలిసి క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశా వంటి చిత్రాల్లో హీరో హీరోయిన్లు గా నటించారట. క్షేమంగా వెళ్లి లాభంగా రండి చిత్రం లో శ్రీకాంత్ రోజా ని వెనుక నుండి హత్తుకునే సన్నివేశం ఒకటి ఉంటుందట. ఆ సన్నివేశానికి శ్రీకాంత్ ఏకంగా 30 టేకులు తీసుకున్నాడట. ఎందుకంటే రోజా అన్నయ్య అని పిలుస్తూ రావడంతో ఆమెని మొదటి నుండి శ్రీకాంత్ చెల్లిగానే చూసేవాడట. ఆ కారణం చేతనే ఆమెలో హీరోయిన్ ని చూడలేకపోయానని, చెల్లిగా చూడడం వల్ల అలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం కష్టం అయ్యేదని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా హత్తుకునే సన్నివేశం లో శ్రీకాంత్ ఇబ్బంది పడడం చూసి, రోజా పర్లేదు అన్నయ్యా, హత్తుకోండి ఏమి కాదు అని చెప్పేడట.
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన ‘కన్నప్ప’..ఎందులో చూడాలంటే!
ఈ సంఘటనలను మొత్తం షేర్ చేసుకొని సరదాగా ఈ ఈవెంట్ లో వీళ్లిద్దరు నవ్వుకున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు నాలుగు సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం రోజా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. కానీ శ్రీకాంత్ మాత్రం క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూనే ఉన్నాడు. అయితే వీళ్లిద్దరు ఈమధ్య కాలం లో చాలా ఎంటర్టైన్మెంట్ షోస్ లో కనిపించారు. ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి సినిమాలు చేసే పరిస్థితి అయితే లేదు కానీ, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా ఈ జోడి ఆడియన్స్ ని అలరించగలదు. రాబోయే రోజుల్లో ఈ జోడి నుండి బుల్లితెర పై ఎలాంటి కాంబినేషన్స్ రాబోతున్నాయి చూడాలి.