spot_img
Homeబిజినెస్Realme P4 Lite: 15 వేల లోపు ఫోన్ కొనాలని అనుకునే వారికి గుడ్ న్యూస్.....

Realme P4 Lite: 15 వేల లోపు ఫోన్ కొనాలని అనుకునే వారికి గుడ్ న్యూస్.. 25 నుంచి సేల్స్ స్టార్ట్…

Realme P4 Lite: మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఫోన్లను తీసుకువస్తుంటాయి. వీటి ద్వారా బడ్జెట్ లోపే ఉన్నా కూడా.. ఇందులో ఉండే ఫీచర్స్ ప్రీమియం ఫోన్లో భలే ఉంటాయి. ఇలాంటి కంపెనీలో Realme గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కొత్తగా మొబైల్ కొనే వారితోపాటు ఇప్పటికే ఉన్నవారు సైతం తమ మొబైల్ ను మార్చుకోవాలని అనుకునేవారు Realme ఫోన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇటీవల ఈ కంపెనీ P4 లైట్ పేరిట కొత్త మోడల్ ను పరిచయం చేసింది. ఇప్పటికే P4, P4 X, P4 Pro వంటి మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చిన ఈ కంపెనీ లేటెస్ట్ గా పి4 లైట్ తో అలరిస్తోంది. ఇందులో ఉండే ఫీచర్స్ ఆకట్టుకునే విధంగా ఉండగా.. ధర మాత్రం రూ,15 వేల లోపే ఉండడంతో చాలామంది దీనిపై ఆసక్తి చెబుతున్నారు. ఇంతకీ ఇందులో ఉన్న స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Also Read: రాజశేఖర్ కొత్త బిజినెస్ ను ఓపెన్ చేయడానికి వెళ్తున్న చిరంజీవి… ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే..?

Realme P4 Lite డిస్ప్లే లో భాగంగా 6.8 అంగుళాల HD+ LCD స్క్రీన్ ను అమర్చారు. ఈ డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 9000 nits బ్రైట్నెస్ తో ఉండే ఈ డిస్ప్లే ఇలాంటి వాతావరణం లోనైనా అద్భుతమైన కాంతిని అందిస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్ మీ యుఐ 7.0 సాఫ్ట్వేర్ ఉండనుంది. అలాగే మీడియాటిక్ డైమెన్సిటీ 6300 5జి ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. రెండు ఏళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్ ఇవ్వడంతోపాటు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందిస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసేవారు ఈ మొబైల్ ను కొనుగోలు చేయవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.

నేటితరం మొబైల్ కొనుగోలు దారులు చాలామంది కెమెరా విషయంలో శ్రద్ధ పెడుతున్నారు. ఇలాంటి వారికి అనుగుణంగా రియల్ మీ కొత్త మొబైల్ లో నాణ్యమైన కెమెరాలు అమర్చారు. ఇందులో 13 MP మెయిన్ కెమెరా ఉండగా..5 MP సెల్ఫీ తో పాటు వీడియో కాలింగ్ కోసం కూడా పనిచేస్తుంది. అలాగే ఇందులో 7000 mAh బ్యాటరీ ని అమర్చారు. ఈ బ్యాటరీ 15 W ఫాస్టెస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. బిజీగా ఉండేవారు చార్జింగ్ విషయంలో ఇబ్బంది పడకుండా ఇది తొందరగా చార్జింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే డౌన్ టైం కూడా తక్కువగా ఉండడంతో రోజువారి వినియోగదారులకు సపోర్ట్ చేస్తుంది.

ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ మొబైల్ ధర రూ.12,999 నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ మొబైల్ ధర రూ.15,999 గా నిర్ణయించారు. మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ ను రియల్ మీ అధికారిక వెబ్సైట్ తో పాటు ఫ్లిప్కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. మార్చి 25 నుంచి దీని విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper