Two Wheelers: సైకిల్ అనేది ఆ కాలంలో స్టేటస్ సింబల్ గా ఉండేది. చదివితే కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. నాటి కాలంలో వరుడికి కట్నం కింద సైకిల్ పెట్టేవారు. కాలం మారింది. కాలం తో పాటు మనుషుల ఆర్థిక స్థితి కూడా మారింది. ఫలితంగా సైకిల్ నుంచి ద్విచక్ర వాహనానికి మనిషి రవాణా సౌకర్యం మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక బైక్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఒకప్పుడు సైకిల్ ని అయితే ఏ విధంగా చూసేవారో.. ఇప్పుడు బైక్ ను ఆ విధంగా చూస్తున్నారు.
Also Read: నాగ్-ధనుష్ ల కుబేరకు భారీ ఓటీటీ డీల్, ఎవరు కొన్నారంటే?
ఇండియాలో ఎన్ని బైకులు ఉన్నాయంటే..
ప్రస్తుతం ప్రతి ఇంటికి ఒక బైకు ఉండడం సర్వసాధారణమైపోయింది. మనదేశంలో మొత్తం 22.1 కోట్ల ద్వి చక్రవాహనాలు ఉన్నాయని ఒకే సర్వేలో తేలింది. అయితే ప్రపంచంలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలు వాడుతున్న దేశం మనదే. మన తర్వాత ఇండోనేషియా 11.2 కోట్ల ద్విచక్ర వాహనాలతో రెండవ స్థానంలో ఉంది. చైనా 8.5 కోట్లతో మూడవ స్థానంలో ఉంది. వియత్నం 5.8 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. థాయిలాండ్ 2.2 కోట్లతో 5వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 1.8 కోట్లతో ఆరవ స్థానంలో ఉంది. మలేషియా 1.5 కోట్లతో ఏడవ స్థానంలో ఉంది. సౌదీ అరేబియా 1.4 కోట్లతో ఎనిమిదవ స్థానంలో ఉంది. తైవాన్ 1.4 కోట్ల ద్విచక్ర వాహనాలతో సౌదీ అరేబియాతో సంయుక్తంగా 8వ స్థానంలో కొనసాగుతోంది. అయితే మిగతా అన్ని దేశాలతో పోల్చి చూస్తే ఆసియాలో యువకులు ఎక్కువగా ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలలోనూ టీవీఎస్ మోపెడ్ లాంటి వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది.
తక్కువ ఖర్చుతో..
విదేశాలలో ఎక్కువగా కార్లను కొనుగోలు చేస్తుంటారు. పైగా ఆసియాలో మాదిరిగా ఇతర దేశాలలో గృహాలు పక్కపక్కనే ఉండవు. ఒకవేళ ఉన్నా ఇరుగుపొరుగు వారితో సంబంధం ఉండదు. పైగా ఆ దేశాలలో జనాభా తక్కువగా ఉంటుంది. పైగా ప్రాంతాలన్నీ దూరంగా ఉంటాయి. అందువల్ల అక్కడి ప్రజలు ద్విచక్ర వాహనాల కంటే కార్లలో ప్రయాణించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందువల్లే అక్కడ కార్ల వినియోగం అధికంగా ఉంటుంది. ఆసియాలో పరిస్థితి అలా కాదు కాబట్టి ఇక్కడ ద్విచక్ర వాహనాల వినియోగం అధికంగా ఉంటుంది.. ఇక మనదేశంలో అనేక కంపెనీలు ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్నాయి. హీరో మోటర్ కార్ప్, హోండా, టీవీఎస్, బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్, యమహా వంటి కంపెనీలు ద్విచక్ర వాహనాల తయారీలో ప్రముఖ సంస్థలుగా ఉన్నాయి. ప్రతి ఏడాది వేల సంఖ్యలో ద్వి చక్రవాహనాలను తయారు చేస్తున్నాయి. అంతటి ఆర్థిక మాంద్యంలో కూడా ద్విచక్ర వాహనాల తయారీ ఏమాత్రం తగ్గడం లేదు.