Homeఎంటర్టైన్మెంట్Kubera OTT: నాగ్-ధనుష్ ల కుబేరకు భారీ ఓటీటీ డీల్, ఎవరు కొన్నారంటే?

Kubera OTT: నాగ్-ధనుష్ ల కుబేరకు భారీ ఓటీటీ డీల్, ఎవరు కొన్నారంటే?

Kubera OTT: టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం కుబేర. ధనుష్-నాగార్జునలు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. కుబేర మూవీలో ధనుష్ మరోసారి డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. ధనవంతుడిగా నాగార్జున పాత్ర ఉంటుందని సమాచారం. టీజర్స్ చూస్తే ఆ భావన కలుగుతుంది. ఇక హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక పాత్ర కూడా సినిమాలో ఛాలెంజింగ్ గా ఉంటుందని సమాచారం. కుబేర మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫిదా అనంతరం శేఖర్ కమ్ముల కుబేర చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.

Also Read: ట్రాక్ లోకి ‘మహేంద్రగిరి వారాహి’ టీమ్… సుమంత్ ఖాతాలో మరో హిట్ పక్కానా..?

జూన్ 20న కుబేర చిత్రం విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. కుబేర చిత్ర ఓటీటీ హక్కులకు డిమాండ్ ఏర్పడింది. అందుకు పలు కారణాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల మినిమమ్ గ్యారంటీ చిత్రాలు తీస్తారు. అలాగే కుబేర మల్టీస్టారర్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మార్కెట్ ఉన్న ధనుష్, నాగార్జున కలిసి నటిస్తున్నారు. ఇక రష్మిక మరొక అడ్వాంటేజ్. ఈ మధ్య కాలంలో ఆమె నటించిన యానిమల్, పుష్ప 2, చావా వందల కోట్ల వసూళ్లు రాబట్టాయి.

ఇన్ని అనుకూలతల నేపథ్యంలో కుబేర చిత్ర ఓటీటీ హక్కుల కోసం ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ పోటీ పడ్డాయట. ఫైనల్ గా అమెజాన్ ప్రైమ్ కుబేర డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందట. అందుకు రూ. 50 కోట్లు చెల్లించినట్లు సమాచారం అందుతుంది. ఇది ధనుష్, నాగార్జున కెరీర్లోనే హైయెస్ట్ ఓటీటీ డీల్ అని తెలుస్తుంది. కుబేర చిత్రాన్ని దాదాపు రూ. 100 నుండి 120 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

కుబేర చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జిమ్ సరబ్, దలిప్ తాహిల్, సునైన ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శేఖర్ కమ్ముల నిర్మిస్తున్నారు. సరైన విజయం అందుకుని చాలా కాలం అవుతుండగా, కుబేర నాగార్జునకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

Exit mobile version