టాటా నుంచి కొత్త కారు.. ఎలా పనిచేస్తుందంటే?

ఇందులో 72 బీహెచ్ పీ పవర్, 95 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మోడల్ లో 85 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ ఎం టార్క్ ను అవుట్ పుట్ ఇస్తుంది.

Written By: Chai Muchhata, Updated On : February 27, 2024 3:38 pm

Tata Tiago icng

Follow us on

ఆటోమోబైల్ మార్కెట్లోకి కొత్త కొత్త కార్లు వస్తుండడంతో వినియోగదారుల అభిరుచులు మారిపోతున్నాయి. అయితే చాలా మంది కేవలం పెట్రోల్, డీజిల్ కార్ల కంటే CNG కార్లపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు సీఎన్ జీ ఉత్పత్తులపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. దేశంలో ని కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తుంది టాటా కంపెనీ. ఈ కంపెనీ నుంచి వచ్చి టియాగో ఎక్కువగా ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిని ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పాటు సీఎన్ జీ కలిపి కొత్త కారును తీసుకొస్తున్నారు. దాని వివరాల్లోకి వెళితే..

కొత్తగా వచ్చే Tiago iCNG AMT 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది సీఎన్ జీ మోడల్ అయినందువల్ల ఇందులో 72 బీహెచ్ పీ పవర్, 95 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మోడల్ లో 85 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ ఎం టార్క్ ను అవుట్ పుట్ ఇస్తుంది. ఈ కారులో ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది. అయితే టియాగో నుంచి వచ్చిన మొటి ఏఎంటీ అని చెప్పవచ్చు.

ఇందులో కంఫర్ట్ ఫీచర్లు ఉన్ానయి. 8స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ రెయిన్ సెన్సింగ్ వైఫర్ష్, ఫోల్టబుల్ ఏఆర్బీఎంలు ఉన్నాయి. కారు బయట ఆటోమేటిక్ హెడ్ లైట్స్ అలరిస్తాయి. ఇంకా అడ్జెస్టబుల్ డ్రైవర్ సీటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ తో కూడిన ఆల్ డిజిట్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, బ్యాక్ సైడ్ కెమెరా పార్కింగ్ సౌకర్యవంతంగా ఉన్నాయి. మిగతా వాహనాల మాదిరిగానే దీనిని కూడా సీఎన్ జీ మోడ్ లో ప్రారంభించుకోవచ్చు. ఇందులో ఏఎంటీ 28.06 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.

ఇన్నర్ లో బూట్ స్పేస్ కోసం 65 లీటర్లు, ట్విన్ సిలిండర్ సీఎన్ జీ ట్యాంకులు ప్లోర్ బోర్డ్ ను అమర్చారు. దీని వల్ల కొంత బూట్ స్పేస్ కలిసి వస్తుంది. టాటా టియాగో సీఎన్ జీని రూ. 78.90 లక్షల ప్రారంభ ధర నుంచి కొనుగోలు చేయొచ్చు. టాప్ ఎండింగ్ రూ.8.90 లక్షల వరకు సొంతం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న మాన్యువల్ ఏఎంటీ కంటే రూ.55 వేలు ఎక్కువగా విక్రయిస్తున్నారు.