Honda Shine 125 New Model: భారతదేశ ఆటోమోబైల్ మార్కెట్లో Honda కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.. ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి బైక్ లేదా స్కూటర్ వస్తుందంటే చాలామంది దానిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇప్పటికే షైన్, యూనికాన్ వంటి బైక్స్ యూత్ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నాయి. అయితే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వాహనాలను డెవలప్ చేస్తూ మార్కెట్లోకి కంపెనీ తీసుకువస్తుంది. ఇందులో భాగంగా Honda shine 125 అనే బైక్ త్వరలో కొత్త డిజైన్‌తో రాబోతుంది. ఇందులో ఆకర్షణీయమైన క్రోమ్ ఫినిష్ మఫ్లర్ కవర్ తోపాటు ఆకట్టుకునే విధంగా గ్రాఫిక్స్ ఉండనున్నాయి. దీంతో ఇది ప్రీమియం లుక్ తో కనిపిస్తోంది. అంతేకాకుండా సౌకర్యవంతమైన సీటింగ్ తో పాటు స్టైలిష్ గా ఉండే అల్లాయి వీల్స్ ఉన్నాయి. దీని ధర ఎంతో చూద్దాం..
త్వరలో మార్కెట్లోకి రాబోతున్న హోండా షైన్ 125 బైక్ ఇంజన్ ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఇది 124 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది 10.7 పవర్ తో పని చేయగా.. 11 NM టార్కును రిలీజ్ చేస్తుంది. దీంతో దీనిపై ప్రయాణం చేసేవారు స్మూతుగా గమ్య స్థలాన్ని చేరుకుంటారు. ఈ ఇంజన్ లీటర్ ఇంధనానికి 55 నుంచి 65 కిలోమీటర్ల మైలేజ్ నీ అందిస్తుంది. దీంతో రోజువారి ప్రయాణికులతో పాటు ఉద్యోగులు, వ్యాపారులు తమ గమ్యాలకు అనుకున్న సమయానికి చేరుకోగలుగుతారు. ఇందులో ఉండే ఫీచర్స్ లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకొని ఉన్నాయి. సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, Acg స్టార్టర్ తో సైలెంట్ స్టార్ట్ , సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ వంటివి ఉన్నాయి. అలాగే ఈ బైక్ సేఫ్టీ కోసం రెండు డ్రమ్ము బ్రేక్‌లను అమర్చారు. ఇందులో ఒకటి రెండు డిస్క్ బ్రేక్ రక్షణను అందిస్తుంది. అలాగే కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టం కూడా సేఫ్టీ ని ఇస్తుంది.
హోండా షైన్ 125 సిసి బైక్‌లో సస్పెన్షన్ సెటప్ రైడర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికి ఉండే టెలిస్కోపిక్ రెంట్ పోర్క్, వెనుక ఉండే హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్లు ఎలాంటి రోడ్లపై నైనా స్మూత్ గా వెళ్లేలా చేస్తాయి. ఈ బైక్ ధర రూ.80,000 తో ప్రారంభమవుతుంది. అదనపు ఫీచర్లు కావాలంటే రూ.90,000 వరకు ఉంటుంది. నేటితరం యూత్ కోరుకునే స్టైలిష్ బైక్ తో పాటు రోజువారి వినియోగదారులకు అనుకూలంగా ఉండే వాహనాల్లో షైన్ 125 బైక్ బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.