Honda : హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI)తన టూ-వీలర్ ఉత్పత్తుల మీద ఆకర్షణీయమైన తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. కస్టమర్లకు ఇన్ స్టంట్ క్యాష్‌బ్యాక్ , ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు స్పెషల్ బహుమతులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ హోండా షైన్ 100, షైన్ 125, యాక్టివా, యాక్టివా 125 మోడళ్లపై వర్తిస్తుంది. అయితే, ఈ తగ్గింపులు మార్చి నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
Also Read : రూ.90లకే ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని 5ఫీచర్స్ తెలిస్తే మెంటలెక్కాల్సిందే ?
ఇన్ స్టంట్ క్యాష్‌బ్యాక్ , ఎక్స్ఛేంజ్ బోనస్
హోండా తమ వాహనాల కొనుగోలుపై రూ.5,100 ఇన్ స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అంతే కాకుండా, పాత వాహనాన్ని ఎక్స్ఛేంజ్ చేసే వారికి అదనంగా రూ.2,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్‌తో పాటు కొనుగోలుదారులకు ఒక స్పెషల్ బహుమతి కూడా అందిస్తారు.
హోండా XL750 ట్రాన్స్‌ఆల్ప్‌పై ప్రత్యేక తగ్గింపు
హోండా ప్రసిద్ధ అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్ XL750 ట్రాన్స్‌ఆల్ప్‌పై ప్రస్తుతం భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ మోటార్‌సైకిల్‌పై రూ.80,000 తక్షణ క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంతే కాకుండా, యాక్సెసరీలపై తగ్గింపు, 90 శాతం ఫైనాన్స్ సౌకర్యంతో కనీస డౌన్ పేమెంట్, తక్కువ వడ్డీ రేటు వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు వర్తిస్తుంది. XL750 ట్రాన్స్‌ఆల్ప్‌లో 755సీసీ లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది 90.51 bhp పవర్, 75 Nm పీక్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
హోండా షైన్
హోండా షైన్ అధిక మైలేజీనిచ్చే బైక్. ఇది 4 వేరియంట్స్, 7 రంగుల్లో అందుబాటులో ఉంటుంది. హోండా షైన్ 125 మోడల్‌లో 123.94సీసీ BS6 ఇంజన్ ఉంటుంది. ఇది 10.59 bhp పవర్, 11 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా షైన్ 100 మోడల్‌లో 98.98సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 7.38 PS పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా షైన్ 100 ధర దాదాపు రూ. 67 వేల నుంచి ప్రారంభమవుతుంది. షైన్ 125 ధర దాదాపు రూ. 84 వేల నుంచి (ఎక్స్-షోరూమ్) మొదలవుతుంది. ఈ బైక్ లీటరుకు 55 కిమీ వరకు మైలేజీనిస్తుంది. హోండా షైన్ 100 రియల్ మైలేజ్ లీటరుకు 65 కిమీ ఉంటుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.
హోండా యాక్టివా
హోండా యాక్టివా ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటి. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) దీన్ని మొదటిసారిగా 2000లో విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ స్కూటర్ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ ఇది. హోండా యాక్టివా 2 మోడళ్లలో అందుబాటులో ఉంది. వీటి ధర రూ. 67,844 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ శ్రేణిలో చౌకైన మోడల్ హోండా యాక్టివా 6G. ఇందులో 109.5సీసీ ఇంజన్ ఉంటుంది. ఇది 7.68 bhpపవర్ ని ఉత్పత్తి చేస్తుంది. అత్యంత ఖరీదైన మోడల్ హోండా యాక్టివా 125. ఇందులో 124సీసీ ఇంజన్ ఉంటుంది. ఇది 8.18 bhpపవర్ ని ఉత్పత్తి చేస్తుంది. యాక్టివా సుమారు లీటరుకు 50 కిమీ వరకు మైలేజీనిస్తుంది. హోండా యాక్టివా 125 సిటీలో సుమారు లీటరకు 52 కిమీ, హైవేపై లీటరకు 65-66.8 కిమీ వరకు మైలేజీనిస్తుందని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. మార్చి నెలాఖరులోపు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోండి.
Also Read : ఆఫర్ పోతే మళ్లీ రాదు.. హోండా కంపెనీ ఈ కార్లపై రూ.1.07లక్షల వరకు బంపర్ డిస్కౌండ్