Honda Cars Discount
Honda Cars Discount : హోండా అమేజ్ 2025 మోడల్ ధరను పెంచిన తర్వాత, ఇప్పుడు హోండా కార్ ఇండియా హోండా ఎలివేట్, హోండా సిటీ, సెకండ్ జనరేషన్ హోండా అమేజ్‌లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ మూడు కార్లపై రూ. 1 లక్ష 07 వేల వరకు ఆదా చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ మోడళ్లపై పొడిగించిన వారంటీ, కార్పొరేట్ డిస్కౌంట్, బైబ్యాక్ స్కీమ్, లాయల్టీ బోనస్, క్యాష్ డిస్కౌంట్ లభిస్తాయి.
భారతదేశంలో హోండా ఎలివేట్ ధర, డిస్కౌంట్ వివరాలు
ముందుగా, 2024 మోడళ్లపై అందుబాటులో ఉన్న డిస్కౌంట్ల గురించి మాట్లాడుకుందాం.. ఈ SUV ZX (MT) వేరియంట్‌పై రూ. 86,100 తగ్గింపుతో, SV/V/VX (MT) వేరియంట్‌పై రూ. 76,100 తగ్గింపుతో, అపెక్స్ ఎడిషన్‌పై రూ. 65,000 వరకు తగ్గింపుతో విక్రయాలు జరుగుతున్నాయి.
2025 మోడళ్ల గురించి మాట్లాడుకుంటే.. ZX (MT) వేరియంట్‌ను రూ. 66,100 తగ్గింపుతో, SV/V/VX (MT)ను రూ. 56,100 తగ్గింపుతో, అపెక్స్ ఎడిషన్ (MT)ను రూ. 45,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అలాగే CVT వేరియంట్‌ను రూ. 46,100 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
ZX (CVT) వేరియంట్‌పై రూ. 86,100 వరకు, V/VX (CVT) పై రూ. 71,100 వరకు, ZX (CVT) బ్లాక్ వేరియంట్‌పై రూ. 66,100 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ SUV ప్రారంభ ధర రూ. 11.91 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.
భారతదేశంలో హోండా సిటీ ధర, డిస్కౌంట్ వివరాలు
హోండా సిటీపై రూ. 73,300 వరకు తగ్గింపు పొందవచ్చు.. అయితే సిటీ e:HEVపై రూ. 90,000 వరకు తగ్గింపు పొందవచ్చు. 5వ తరం హోండా సిటీ మోడల్ ధర రూ. 12,28,100 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమైతే, HEV మోడల్ ధర రూ. 20,75,100 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.
భారతదేశంలో హోండా అమేజ్ ధర, డిస్కౌంట్ వివరాలు
2025 మోడల్ హోండా అమేజ్ లాంచ్ తర్వాత..ఇప్పుడు కంపెనీ ఈ కారు మునుపటి తరం మోడల్‌పై అత్యధిక తగ్గింపును అందిస్తోంది. ఈ కారు E, S వేరియంట్లపై రూ. 57,200 తగ్గింపు, VX వేరియంట్‌పై రూ. 1.07 లక్షల వరకు తగ్గింపు ఇవ్వబడుతోంది.
హోండా అమేజ్ డిస్కౌంట్
ఈ కారు ధర రూ. 7,62,800 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ హోండా వాహనాలకు సంబంధించిన ఆఫర్ల గురించి మరింత సమాచారం కోసం మీరు మీ సమీప డీలర్‌ను సంప్రదించవచ్చు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: If the offer is gone it will not come again honda company will give a bumper discount
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com