https://oktelugu.com/

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. మార్చిలో సెలవులు ఎన్నిరోజులంటే..?

ఫిబ్రవరి నెలలో బ్యాంకు సెలవులు తక్కువగా ఉండటం వల్ల బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు, ఈ నెలలో బ్యాంకు లావాదేవీలు జరిపే వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడలేదు. ఈ నెలలో రెండు, నాలుగు శనివారాలు, ఆదివారాలు మాత్రమే బ్యాంకు సెలవులుగా ఉన్నాయి. అయితే మార్చి నెలలో మాత్రం మొత్తం 8 రోజులు బ్యాంకు సెలవులుగా ఉన్నాయి. మార్చి నెలలో మహాశివరాత్రి, హోలీ పండుగ రోజులుగా ఉన్నాయి. Also Read: ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 27, 2021 / 02:51 PM IST
    Follow us on

    ఫిబ్రవరి నెలలో బ్యాంకు సెలవులు తక్కువగా ఉండటం వల్ల బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు, ఈ నెలలో బ్యాంకు లావాదేవీలు జరిపే వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడలేదు. ఈ నెలలో రెండు, నాలుగు శనివారాలు, ఆదివారాలు మాత్రమే బ్యాంకు సెలవులుగా ఉన్నాయి. అయితే మార్చి నెలలో మాత్రం మొత్తం 8 రోజులు బ్యాంకు సెలవులుగా ఉన్నాయి. మార్చి నెలలో మహాశివరాత్రి, హోలీ పండుగ రోజులుగా ఉన్నాయి.

    Also Read: ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ చేసుకోవాలా.. ఆప్షన్లు ఇవే..?

    మార్చి నెల బ్యాంకు సెలవుల జాబితాను పరిశీలిస్తే మార్చి 7వ తేదీ, 14వ తేదీ, 21వ తేదీ, 28వ తేదీలలో ఆదివారం కావడంతో బ్యాంకు సెలవులుగా ఉండగా రెండో శనివారం మార్చి 13వ తేదీ, నాలుగో శనివారం మార్చి 27వ తేదీ కూడా బ్యాంకు సెలవులుగా ఉన్నాయి. మహాశివరాత్రి మార్చి 11వ తేదీన కాగా హోలీ మార్చి 29వ తేదీన ఉన్నాయి. ఈ ఎనిమిది రోజులతో పాటు అదనంగా మరో రెండు రోజులు బ్యాంకులకు సెలవులు ఉండే అవకాశాలు ఉన్నాయి.

    Also Read: 50 లీటర్ల పెట్రోల్ ఫ్రీగా పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

    తొమ్మిది బ్యాంక్ ఎంప్లాయ్ యూనియన్లు రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మార్చి నెల 15వ తేదీ నుంచి సమ్మె ప్రకటించాయి. సమ్మె జరిగితే రెండు రోజుల పాటు బ్యాంకు సెలవులుగా ఉండే అవకాశాలు ఉంటాయి. మార్చి నెల 27న నాలుగో శనివారం కాగా 28వ తేదీన ఆదివారం, మార్చి 29వ తేదీన హోలీ పండుగ కావడంతో ఆరోజు కూడా సెలవు దినంగా ఉండనుంది.

    మరిన్ని వార్తలు కోసం: వ్యాపారము

    మార్చి నెలలో బ్యాంకు లావాదేవీలు నిర్వహించే వాళ్లు సెలవులపై అవగాహన కలిగి ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే లావాదేవీలు జరిపే సమయంలో ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడవచ్చు.