కృష్ణదేవరాయలు మరణించింది ఎప్పుడో తెలుసా

విజయనగర సామ్రాజ్యాధీశుడు కృష్ణదేవరాయలు మరణంపై ఆది నుంచి అనుమానాలు ఉన్నాయి. ఆయన మరణించిన తేదీపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. కానీ.. తాజాగా కర్ణాటకలో ఓ చారిత్రక శాసనం బయటపడడంతో కృష్ణదేవరాయల మరణ తేదీపై నెలకొన్ని సందిగ్ధత వీడినట్లు తెలుస్తోంది. ‘దేశభాషలందు తెలుగులెస్స’ అంటూ విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు ప్రపంచానికి తెలుగుభాష గొప్పతనాన్ని చాటారు కృష్ణదేవరాయలు. అష్టదిగ్గజ కవులకు ఆయన తన ఆస్థానంలో చోటు కల్పించారు. తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. తెలుగులో గొప్ప కవులైన […]

Written By: Srinivas, Updated On : February 27, 2021 2:59 pm
Follow us on


విజయనగర సామ్రాజ్యాధీశుడు కృష్ణదేవరాయలు మరణంపై ఆది నుంచి అనుమానాలు ఉన్నాయి. ఆయన మరణించిన తేదీపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. కానీ.. తాజాగా కర్ణాటకలో ఓ చారిత్రక శాసనం బయటపడడంతో కృష్ణదేవరాయల మరణ తేదీపై నెలకొన్ని సందిగ్ధత వీడినట్లు తెలుస్తోంది. ‘దేశభాషలందు తెలుగులెస్స’ అంటూ విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు ప్రపంచానికి తెలుగుభాష గొప్పతనాన్ని చాటారు కృష్ణదేవరాయలు. అష్టదిగ్గజ కవులకు ఆయన తన ఆస్థానంలో చోటు కల్పించారు. తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. తెలుగులో గొప్ప కవులైన అల్లసాని పెద్దన, నంది తిమ్మన, తెనాలి రామలింగడు వంటి కవులంతా ఆయన ఆస్థానంలోనే కొలువుదీరారు.

Also Read: గేమ్‌ స్టార్ట్‌ చేసిన బైడెన్‌ : మరోసారి సిరియాపై వైమానిక దాడులు

శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి ఇప్పటికే అనేక పరిశోధనలు సాగుతున్నాయి. ఆయన ఎప్పుడు పుట్టారు..? ఎప్పుడు మరణించారు..? అన్న విషయాలపై కచ్చితమైన చారిత్రక ఆధారాలు లేవు. తాజాగా బయటపడ్డ శాసనంతో శ్రీకృష్ణదేవరాయలు మరణించిన తేదీపై ఓ క్లారిటీ వచ్చేసింది. కర్ణాటకలోని తుమకూర్ జిల్లాలోని ఒక ఆలయంలో ఓ శాసనం బయటపడింది. ఈ శాసనంలో శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు మరణించారో స్పష్టంగా ఉంది.

ఈ శాసనం ప్రకారం.. కృష్ణదేవరాయలు అక్టోబర్17,1529న తుదిశ్వాస విడిచారని తేలింది. పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుండగా.. తుమకూర్ జిల్లాలోని హొన్నెనహళ్లి గ్రామంలోని గోపాలకృష్ణ ఆలయంలో నల్ల రాతిపై ఈ శాసనాన్ని గుర్తించారు. ఈ శాసనం ద్వారా కృష్ణదేవరాయలు మరణించిన కచ్చితమైన తేదీ బయటకు వచ్చిందని డైరెక్టరేట్ ఆఫ్ ఎపిగ్రఫీ నిపుణులు కేఆర్ నరసింహన్ ఆయన సహచరుడు కె ధన్పాల్ ప్రకటించారు. శుక్రవారం వాళ్లు ఈ ఆలయాన్ని సందర్శించి శాసనాన్ని పరిశీలించారు.

Also Read: జగన్‌ చేతుల మీదుగా వారికి సన్మానం

ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ.. ‘శ్రీ కృష్ణ దేవరాయలు మరణం గురించి ఇప్పటివరకు క్లారిటీ లేదు. కృష్ణదేవరాయలు తమ్ముడు అచ్యుతా దేవరాయలు 1529 అక్టోబర్ 21న తులువా రాజవంశం నాల్గవ రాజుగా పట్టాభిషక్తుడయ్యాడు. ఇందుకు సంబంధించిన ఓ శాసనం గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ కాళహస్తిలో లభ్యమైంది. అయితే అంతకంటే కొద్దిరోజులకు ముందే శ్రీకృష్ణదేవరాయలు మరణించి ఉంటారని అంతా భావించారు. కానీ.. కచ్చితమైన తేదీ లేదు. తాజాగా శాసనంతో కచ్చితమైన తేదీ బయటకు వచ్చింది’ అని ఆయన చెప్పారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్