https://oktelugu.com/

Gautam Adani: హిండెన్‌బర్గ్ నుంచి న్యూయార్క్ ఫెడరల్ కోర్టు వరకు.. అదానీపైనే ఆరోపణలు ఎందుకు?

హిండెన్‌బర్గ్ రిపోర్ట్ నుంచి న్యూయార్క్ కోర్టు వరకు ఆరోపణలు అన్ని కూడా అదానీ కంపెనీ పైనే వచ్చాయి. అసలు నిజానికి అదానీ కంపెనీ ఇలాంటి తప్పులు చేసిందా? లేకపోతే ఆరోపణలు చేస్తున్నారా? అనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉన్నాయి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 22, 2024 / 12:33 AM IST

    Gautam Adani

    Follow us on

    Gautam Adani: భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్‌ కోసం 265 బిలియన్ డాలర్లు అనగా దాదాపుగా రూ.2200 కోట్లు అదానీ అమెరికా ఇన్వెస్టర్లకు ఇచ్చినట్లు అమెరికాలోని న్యూయార్క్‌లో కేసు నమోదు చేశారు. అదానీతో పాటు అతని మేనల్లుడు సాగర్‌తో సహా మరో 7గురిపై కేసు నమోదు చేసి, ఇప్పటికే అరెస్టు వారెంటీ కూడా జారీ చేశారు. అయితే ఎందరో పారిశ్రామిక వేత్తలు మన దేశంలో ఉండగా.. అదానీపైనే ఆరోపణలు వస్తున్నాయి. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ నుంచి న్యూయార్క్ కోర్టు వరకు ఆరోపణలు అన్ని కూడా అదానీ కంపెనీ పైనే వచ్చాయి. అసలు నిజానికి అదానీ కంపెనీ ఇలాంటి తప్పులు చేసిందా? లేకపోతే ఆరోపణలు చేస్తున్నారా? అనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉన్నాయి. గతంలో హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేయడంతో అదానీ షేర్లు నష్టాలు చూసింది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు అదానీ కంపెనీపై వచ్చిన ఆరోపణలు ఏంటి? పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

    మొదటిసారి హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో స్టార్ట్ అయ్యి..
    మొదటిసారి అదానీ కంపెనీపై హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసింది. గతేడాది హిండెన్‌బర్గ్ కంపెనీ మనీలాండరింగ్ విషయంలో అదానీ కంపెనీపై ఆరోపణలు చేసింది. అదానీ కంపెనీ షేర్లలో అవకతవకలు చేస్తుందని, కంపెనీలో మోసాలు జరుగుతున్నాయని, కంపెనీ నిజస్వరుపాన్ని బయట పెట్టింది. దాదాపుగా కొన్ని పేజీలతో ఉన్న రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ విడుదలతో అదానీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో వెంటనే సుప్రీంకోర్టు ఈ కేసును కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసి, సెబీకి అప్పగించింది. ఇందులో అదానీకి సపోర్ట్‌గానే తీర్పు వచ్చింది.

    తక్కువ గ్రేడ్ బొగ్గు ఎక్కువగా గ్రేడ్‌గా విక్రయిస్తున్నారని..
    అదానీ కంపెనీ బొగ్గును కొనుగోలు చేసింది. ఇండోనేషియా కంపెనీ నుంచి అదానీ కంపెనీ దాదాపుగా 28 మిలియన్ల బొగ్గును కొనుగోలు చేసింది. రూ.2360 కి కొనుగోలు చేసిన ఈ బొగ్గును తమిళనాడు కంపెనీ రూ.7750కి విక్రయించిందని ఆరోపణలు వచ్చాయి. తక్కువ గ్రేడ్ ఉన్న బొగ్గును ఇలా నాణ్యత ఉన్న బొగ్గుగా ఎక్కువ ధరకు అమ్మిందని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ టైమ్స్ గతంలో తెలిపింది.

    సెబీ చీఫ్ అయిన మాధబి పూరీ విషయంలో..
    సెబీ చీఫ్ మాధబి పూరీ అదానీ కంపెనీలో షేర్లు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసింది. ఈ కారణంగానే గతంలో అదానీపైన ఆరోపణలు చేసిన కూడా సెబీ చర్యలు తీసుకోలేదని తెలిపింది. అదానీ కంపెనీలో మాధబి పెట్టుబడులు ఉన్నాయని, అందుకే సపోర్ట్‌గా ఉందని తెలిపింది. ఈమె బాధ్యత గల ఒక హోదాలో ఉండి కూడా బయట నుంచి వేతనం తీసుకుందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఇలా పలుమార్లు అదానీపై ఆరోపణలు వచ్చాయి. కానీ ఈ ఆరోపణలు అన్ని నిరాధారమైనవని కొట్టేసేశారు.