https://oktelugu.com/

Switzerland : స్విట్జర్లాండ్ అంటే టాక్స్ హెవెన్ అంటారు గాని.. అక్కడి ప్రజల ఎకనామి పాలసీ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..

వచ్చే రా బడికి ఖర్చు తక్కువగా ఉండాలి. అప్పుడే ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరిగినా తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది. అదే వచ్చే రాబడి కి, చేసే ఖర్చుకు లంకె కుదరకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదైనా ఉత్పాతం జరిగితే చుక్కలు చూడాల్సి వస్తుంది. అయితే పొదుపులో, రాబడిలో, భవిష్యత్తును అంచనా వేయడంలో స్విట్జర్లాండ్ ప్రజల తర్వాతే ఎవరైనా.. ఇంతకీ వాళ్లు ప్రపంచానికి చెబుతున్న ఆర్థిక పాఠాలు ఎలా ఉన్నాయంటే..

Written By:
  • Neelambaram
  • , Updated On : November 22, 2024 / 12:13 AM IST

    Switzerland

    Follow us on

    Switzerland : స్విట్జర్లాండ్ పేరు చెప్తే ఎవరికైనా టాక్స్ హెవెన్ కంట్రీ గుర్తుకు వస్తుంది. అది నిజమే. కాకపోతే ఎలాగూ విదేశాల నుంచి నల్ల డబ్బు వస్తుంది కాబట్టి.. పెద్దగా ఇబ్బందులేదు అనుకునే రకం స్విస్ ప్రజలు కాదు. కష్టించి పనిచేయడంలోనే కాదు.. భవిష్యత్తును ఊహించుకొని డబ్బులను పొదుపు చేయడంలో వారి తర్వాతే ఎవరైనా. అందువల్లే స్విస్ దేశంలో ప్రతి ఏడుగురులో ఒకరు లక్షాధికారి ఉన్నారు. ప్రతి 80,000 మందిలో ఒకరు బిలియనీర్ ఉన్నారు. వచ్చే ఆదాయంలో తక్కువ ఖర్చు చేస్తారు. ఎక్కువ పొదుపు చేస్తారు. సొంత గృహాలు ఉన్నప్పటికీ కిరాయి ఇంట్లోనే ఉంటారు. ఎక్కువ రిటర్న్స్ వచ్చే వాటిల్లో పెట్టుబడి పెడతారు. డబ్బులను పొదుపు చేయగా మిగిలిన వాటిని మాత్రమే ఖర్చు చేస్తారు. చదువు కోసం, నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఐదు నుంచి 10% ఖర్చు చేస్తారు. ఖర్చు కోసం, సేవింగ్స్ కోసం, ఇతర వ్యవహారాల కోసం మూడు ఖాతాలను కొనసాగిస్తారు. ఈ మూడు ఖాతాలలో కొనసాగించే నగదు నిల్వల నిష్పత్తిలో సేవింగ్స్ ఖాతాలో నగదు ఎక్కువ ఉండే విధంగా చూసుకుంటారు. ఖర్చుకు సంబంధించిన ఖాతాలో నగదు తక్కువగా ఉండేలా చూసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో రుణాలు తీసుకోరు. ఒకవేళ రుణాలు తీసుకున్నప్పటికీ తక్కువ వడ్డీ మీద మాత్రమే తీసుకుంటారు.

    కష్టపడి పని చేస్తారు

    స్విస్ ప్రజలు కష్టపడి పని చేస్తారు.. ఒక వయసుకు వచ్చిన తర్వాత ఎక్కువగా స్వతంత్రతను ఇష్టపడతారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పటికీ.. ఆర్థిక స్థిరత్వాన్ని సొంతంగా సాధించుకునే దిశగా అడుగులు వేస్తారు. ఒక వయసుకు వచ్చిన తర్వాత వివాహం చేసుకొని వేరే కాపురం పెడతారు.. చదువుకొని, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ.. మూలాలు మర్చిపోరు. కన్నవాళ్లను, జీవితంలో ఎదగడానికి తోడ్పడిన వాళ్లను గుర్తు పెట్టుకుంటారు. చరమాంకంలో వారికి తోడుగా ఉంటారు. అందువల్లే స్విట్జర్లాండ్ దేశంలో వృద్ధాశ్రమాలు ఉండవు. అక్కడ విశ్వవిద్యాలయాలు కూడా నైపుణ్యాన్ని పెంచడంలో ఎక్కువగా తోడ్పడుతుంటాయి.. అందువల్లే సంతోష సూచీలో, నైపుణ్య సూచీలో, వృద్ధి సూచీలో స్విట్జర్లాండ్ టాప్ స్థానంలో ఉంటుంది. అంతేకాదు అప్పుల్లో చివరి స్థానంలో ఉంటుంది. తలసరి ఆదాయం, స్థూల జాతీయోత్పత్తిలో స్విట్జర్లాండ్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు తీసిపోదు.. అయితే ఈ దేశానికి టూరిజం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది.. పచ్చదనం, పరిశుభ్రతకు ఆ దేశ ప్రజలు పెద్దపీట వేస్తారు కాబట్టి.. ఈ దేశాన్ని భూతల స్వర్గం అని పిలుస్తారు.

    Tags