https://oktelugu.com/

Rythu Bandhu:  తెలంగాణ రైతులకు సర్కార్ శుభవార్త.. ఖాతాల్లో నగదు జమ!

Rythu Bandhu:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రయోజనం చేకూరేలా రైతుబంధు స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎకరాకు 5,000 రూపాయల చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాలలో నగదు జమ చేయనుంది. ఈ స్కీమ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 61 లక్షల 49 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. 7,600 కోట్ల రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయనుంది. రాష్ట్రంలోని కోటీ 52 లక్షల ఎకరాలకు సంబంధించి ఈ నగదు జమ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 28, 2021 / 09:50 AM IST
    Follow us on

    Rythu Bandhu:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రయోజనం చేకూరేలా రైతుబంధు స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎకరాకు 5,000 రూపాయల చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాలలో నగదు జమ చేయనుంది. ఈ స్కీమ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 61 లక్షల 49 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. 7,600 కోట్ల రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయనుంది.

    Rythu Bandhu

    రాష్ట్రంలోని కోటీ 52 లక్షల ఎకరాలకు సంబంధించి ఈ నగదు జమ కానుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 28వ తేదీ నుంచి నగదు జమ చేయాలని అధికారులకు సూచనలు చేశారు. వ్యవసాయ, ఆర్థికశాఖలు ఈ స్కీమ్ కు సంబంధించి కసరత్తులు చేస్తున్నాయి. కొత్తగా భూములను కొనుగోలు చేసిన రైతులు ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ బుక్, రెవిన్యూ ఖాతా వివరాలను ఇవ్వడం ద్వారా ఏఈవోల సహాయంతో రైతుబంధు పోర్టల్ లో వివరాలను నమోదు చేసుకోవచ్చు.

    Also Read: Revanth Reddy: వరి విషయంలో కేసీఆరే టార్గెట్.. రేవంత్ ప్లాన్ సక్సెస్..!

    ఏఈవోలు వివరాలను నమోదు చేస్తే మాత్రమే రైతుల ఖాతాలలో నగదు జమయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. రైతులకు అండగా నిలబడాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నారు. నగదు జమ చేసిన తర్వాత వ్యవసాయ శాఖ నుంచి రైతు సెల్ ఫోన్ కు మెసేజ్ వెళ్లే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైతుబీమా, పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగువిధానం, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, విత్తనాలు-ఎరువుల గురించి కేసీఆర్ కలెక్టర్లతో చర్చించారు.

    మొదట ఎకరా భూమి ఉన్న రైతుల ఖాతాలలో నగదు జమ కానుంది. రైతుల వివరాలతో పాటు బ్యాంకు ఖాతాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, రెవెన్యూ ఖాతాల వివరాలను అధికారులు ఆన్ లైన్ లో తనిఖీ చేస్తున్నారు.

    Also Read: Bandi Sanjay: బండి సంజ‌య్ నిరుద్యోగ దీక్ష అందుకోసమేనా?