https://oktelugu.com/

RRR: నా చివరి శ్వాస వరకు తారక్​ స్నేహం నా గుండెల్లో నిలిచిపోతుంది- చరణ్​

RRR: దేశమంతటా ఎంతో ఉత్కంఠగా ఎందురుచూస్తున్న భారీ పాన్​ ఇండియా చిత్రం ఆర్​ఆర్​ఆర్​. రాజమౌళి దర్శకత్వంలో తారక్​, రామ్​చరణ్​ హీరోలుగా వస్తున్న ఈ సినిమా ఇది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​పై రాజమౌళి ఫుల్ జోరు పెంచారు. ఇటీవలే ముంబయిలో ప్రీ రిలీజ్​ ఈవెంట్ నిర్వహించి బాలీవుడ్​లో హైప్ క్రియేట్​ చేసిన ఆర్​ఆర్​ఆర్​ టీమ్​.. తాజాగా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్​ను నిర్వహించింది. ఈ సందర్భంగా రామ్​చరణ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 28, 2021 / 09:55 AM IST
    Follow us on

    RRR: దేశమంతటా ఎంతో ఉత్కంఠగా ఎందురుచూస్తున్న భారీ పాన్​ ఇండియా చిత్రం ఆర్​ఆర్​ఆర్​. రాజమౌళి దర్శకత్వంలో తారక్​, రామ్​చరణ్​ హీరోలుగా వస్తున్న ఈ సినిమా ఇది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​పై రాజమౌళి ఫుల్ జోరు పెంచారు. ఇటీవలే ముంబయిలో ప్రీ రిలీజ్​ ఈవెంట్ నిర్వహించి బాలీవుడ్​లో హైప్ క్రియేట్​ చేసిన ఆర్​ఆర్​ఆర్​ టీమ్​.. తాజాగా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్​ను నిర్వహించింది.

    RRR

    ఈ సందర్భంగా రామ్​చరణ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాకోసం మేం చాలా కష్టపడ్డాం. జక్కన్నను మా గురువు అనాలో.. మా హెడ్​మాస్టర్ అనాలో తెలియట్లేదు. ఆయన గురించి చెప్పడానికి నా మాటలు సరిపోవు. తారక్​తో కలిపి నన్ను సినిమాలో చేర్చినందుకు రాజమౌళికి చాలా థ్యాంక్స్​. తమిళ్​లో డబ్బింగ్​ చెప్పలేనని అంటే.. మదన్ గారు మాకు నేర్పించి మరి చేయించారు.. ఆయనకు కూడా థ్యాంక్స్ .. అంటూ చెప్పుకొచ్చారు చెర్రి.

    Also Read: NTR and Charan: ఎన్టీఆర్, చరణ్ లలో గొప్ప గుణాల సీక్రెట్స్ చెప్పిన రాజమౌళి

    ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడిన చెర్రీ.. నాకన్న వయసులో పెద్దవాడు. కానీ, జీవితంలో, బిహేవియర్​లో చాలా చిన్నపిల్లాడిలా ఉంటాడు. కానీ, సింహంలాంటి ధైర్యం ఉన్నోడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి బ్రదర్​ను నాకిచ్చిందనుకు ఆ దేవుడికి చాలా థ్యాంక్స్​. ఈ సినిమా హిట్ అయితే, అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం.. కానీ, నేను మాత్రం ఎన్టీఆర్ బ్రర్ దొరికినందుకు హ్యాపీగా ఉంటుంది. నేను చనిపోయే వరకు తారక్​ స్నేహం నా గుండెల్లో శాస్వితంగా నిలిచిపోతుంది. అని పేర్కొన్నారు చెర్రి. ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది.

    Also Read: Akhanda 25 Days Collections: అఖండ 25 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !