Medaram Event: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారానికి పేరు ఉంది. ఈ జాతర ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఈసారి జాతరకు దాదాపు 10 లక్షల మించి భక్తులు వస్తారని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే భక్తుల తగ్గట్టుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. గత ప్రభుత్వాలు తాత్కాలికంగా అభివృద్ధి పనులు చేపడితే, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వందల కోట్ల ఖర్చుతో శాశ్వత నిర్మాణాలను ఏర్పాటు చేస్తోంది.
మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈ క్రమంలో ఈ జాతరను పురస్కరించుకొని శాశ్వతమైన పనులను ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది.. ఆలయ విస్తరణ పనులను ముమ్మరంగా చేపడుతోంది. గద్దల ముందు రాతి స్తంభాలతో ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేశారు.. ఇందుకోసం ఎనిమిది భారీ స్తంభాలను ఏర్పాటు చేశారు. ప్రతి రాతి స్తంభం మీద ఆదివాసీల చరిత్రను తెలిపే విధంగా బొమ్మలను రూపొందించారు. ప్రస్తుతం ఒకే వరుసలో గద్దెల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. మరి కొద్ది రోజుల్లో ఈ పనులు పూర్తికా బోతున్నాయి.. ఈనెల 24న పూజారుడు గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెలను ప్రతిష్టాపన చేస్తానని తెలుస్తోంది.
మేడారం ఆలయ అభివృద్ధి పనులను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ పనులకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి శంకుస్థాపన చేశారు. దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక శాసనసభ సభ్యురాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఎప్పటికప్పుడు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. పనుల్లో నాణ్యత ఉండేలా చూస్తున్నారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి శిల్పులు, కార్మికులు, ఇంజనీర్లు శ్రమిస్తున్నారు. తద్వారా మేడారానికి సరికొత్త రూపు వచ్చే విధంగా చమటోడ్చుతున్నారు.
మేడారం.. ఆదివాసీలకు ఇలవేల్పు అయిన సమ్మక్క సారలమ్మకు ప్రధాన ఆలయం. ఇది ఆసియాలోనే గిరిజనులు జరుపుకునే అతిపెద్ద జాతర. ఈ జాతరకు లక్షలలో భక్తులు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే సౌకర్యాలు కల్పిస్తోంది. వందల సంఖ్యల పోలీసులను.. అంతే స్థాయిలో ఆర్టీసీ బస్సులను.. ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సిబ్బందిని భక్తుల సేవలో తరించడానికి సర్కార్ నియమించనుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర వస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వినియోగం.. మీడియా విస్తృతి పెరిగిన తర్వాత మేడారం జాతర ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందని ఇక్కడి భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివాసీ కోయల మూలాలు / గొట్టు (గోత్రాలు) / నుదుటి బొట్టుల గురించి పూర్తి సమాచారం #Medaram #SammakkaSaralammajathara #Medaramjathara2026 #Rajesh pic.twitter.com/BOPG7cQGV0
— Hi Warangal (@HiWarangal) December 18, 2025