Homeబిజినెస్Google Pixel 10A Series: గుడ్ న్యూస్ చెప్పిన Google Pixel..

Google Pixel 10A Series: గుడ్ న్యూస్ చెప్పిన Google Pixel..

Google Pixel 10A Series: Google pixel మొబైల్స్ కు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తుంది. దీని నుంచి ఏ సిరీస్ వస్తుందో అన్న ఆసక్తితో వినియోగదారులు ఎదురుచూస్తూ ఉంటారు. వీరికి అనుగుణంగా ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తో పాటు మెరుగైన బ్యాటరీ సామర్థ్యం ఉన్న మొబైల్స్ను మార్కెట్లోకి తీసుకువస్తుంటుంది గూగుల్. ఇప్పటివరకు 9 సిరీస్ తీసుకొచ్చిన గూగుల్ పిక్సెల్ ఇప్పుడు త్వరలో 10a సిరీస్ తో రాబోతుంది. మిడిల్ క్లాస్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని దీనిని శక్తివంతమైన మొబైల్ గా మార్చినట్లు తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

గూగుల్ పిక్సెల్ నుంచి 10a సిరీస్ మొబైల్ మార్చి 6 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉండనుంది. అయితే ఇప్పటికే దీని గురించి సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉంది. మొత్తం నాలుగు భిన్నమైన మోడళ్లలో మార్కెట్లోకి రాబోతున్న ఇందులో డిస్ప్లే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ మొబైల్లో 6.3 అంగుళాల POLED డిస్ప్లే ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 3,000 nits బ్రైట్నెస్ తో పనిచేయడం వల్ల వీడియోలు, సినిమాలను చూసేటప్పుడు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అలాగే ఈ డిస్ప్లేపై కోరింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ ఇస్తుంది. ఈ మొబైల్ లో కెమెరా పనితీరు కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 48 MP మెయిన్ కెమెరా ఉండనుంది. 13 MP ఆల్ట్రా వైట్ కెమెరాతో డ్యూయల్ సెటప్ ను అమర్చారు. సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్ కోసం 13 ఎంపీ కెమెరా పనిచేయనుంది. సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారితో పాటు నేటి తరం వారికి అద్భుతమైన ఫోటోలు కావాలంటే ఈ కెమెరా బాగా పనిచేయనుంది.

ఇందులో మెరుగైన బ్యాటరీ ఉన్నట్టు తెలుస్తోంది.5100 mAh బ్యాటరీ ఉండగా దీనికి 30W వైర్డ్, 10W వైర్లెస్ చార్జర్ సపోర్ట్ చేయనుంది. అలాగే నేటితరం యూత్ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఇందులో ఫీచర్స్ ఉండనున్నాయి. వైఫై తోపాటు బ్లూటూత్ 6, USB type C వంటి ఫీచర్లు సౌకర్యవంతంగా ఉంటాయి. అలాగే ఇలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకునే విధంగా దీనిపై రక్షణగా గ్లాస్ ఉండనుంది. ఇక ఈ మొబైల్ 183 గ్రాముల బరువు ఉండడంతో చేతిలో పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మార్కెట్లోకి వచ్చిన సమయంలో గూగుల్ పిక్సెల్ 10a మొబైల్ ను రూ.49,999 ధరతో విక్రయించనున్నారు. మొత్తం ఒకేసారి చెల్లించకుండా ఈఎంఐ ద్వారా కూడా దీన్ని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది.ఇందులో 8GB రామ్, 256 GB స్టోరేజ్ ఉండడంతో కావలసిన ఫైల్స్ ను స్టోర్ చేసుకోవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version