Homeబిజినెస్Toyota Rumion: 7 సీటర్ వేరియంట్ లో దుమ్ము రేపుతున్న కారు.. ధర అందుబాటులోనే..

Toyota Rumion: 7 సీటర్ వేరియంట్ లో దుమ్ము రేపుతున్న కారు.. ధర అందుబాటులోనే..

Toyota Rumion: ఉమ్మడి ఫ్యామిలీ కలిసి విహారయాత్రకు వెళ్లాలంటే 7 సీటర్ కారు కంఫర్ట్ గా ఉంటుంది. దీంతో కొత్తగా కారు కొనాలనుకునే వారు ఈ ఆలోచనతో సెవెన్ సీటర్ కార్లపై ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఇటీవల ఓ కారు విపరీతంగా విక్రయాలు జరుపుకుంటుంది. ఒకప్పుడు సొంత అవసరాలకు సెడాన్ కార్లను మాత్రమే కొనుగోలు చేసేవారు ఇప్పుడు సెవెన్ సీటర్ కార్లను కొనుగోలు చేయడంతోనే ఈ అమ్మకాలు పెరుగుతున్నట్లు తెలుస్తోందని మార్కెటింగ్ ప్రతినిధులు అంటున్నారు. ఇంతకీ అత్యధిక సేల్స్ జరుపుకుంటున్న ఆ కారు ఏది? అందులో ఉన్న స్పెషల్ ఏంటి?

TOYOTA కంపెనీ నుంచి SUV సెగ్మెంట్లో ఇప్పటికే చాలా వరకు 7 సీటర్ కార్లు వచ్చాయి. అయితే ఇటీవల Rumion కారుకు ఆదరణ పెరుగుతోంది. 2026 జనవరి అమ్మకాలను చూస్తే దీనికి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నెలలో 2,829 యూనిట్ల విషయాలు జరుపుకుంది. గత ఏడాది జనవరి తో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో 46% వృద్ధితో అమ్మకాలు జరిపినట్లు లెక్కలు చెబుతున్నాయి. సాధారణంగా MPV కార్లకు మిగతా వాటికంటే డిమాండ్ తక్కువగానే ఉంటుంది. కానీ వినియోగదారుల ఆలోచన తీరు మారుతున్నట్లు తెలుస్తోంది. సొంత అవసరాలతో పాటు కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీనిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా ట్రావెల్ కోసం సైతం ఇదే కారణం ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీనిని మార్కెట్లో రూ.10.51 లక్షలా ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఈ ధర మిడిల్ క్లాస్ వారికి అనుగుణంగా ఉండడంతో వీరు ఎక్కువగా దీనిపై మక్కువ చూపుతున్నారు. అటు ఉన్నతశ్రేణి వర్గాలు సైతం ఈ కారు డిజైన్ కు ఆకస్థితులు అవుతున్నారు.

అయితే ఈ కారుకు డిమాండ్ ఉండడానికి ఇందులో ఉండే ఫీచర్స్, స్పెసిఫికేషన్ అని చెబుతున్నారు. ఇందులో ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే LED హెడ్ ల్యాంప్స్, 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే స్టైలిష్ గా కనిపించే విధంగా బాడీని మార్చారు. ఇందులో ఇంజన్ పనితీరు కూడా మెరుగ్గానే ఉంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండగా ఇది..102 PS పవర్ ను అందిస్తుంది.137 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ కారులో పెట్రోల్ తో పాటు CNG ఆప్షన్ కూడా ఉంది. ఈ రెండు ఇంజన్లు 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తాయి. ఇవి లీటర్ ఇంధనానికి 20.51 నుంచి 26 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ కారులో ఆకట్టుకునే స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టంతో పాటు 6 స్పీకర్ సౌండ్ సిస్టం, ఆటోమేటిక్ ఏసీ, కీ లెస్ ఎంట్రీ వాటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS వంటి టెక్నాలజీ ఉండడంతో సేఫ్టీ గా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version