https://oktelugu.com/

Gold Prices: గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు..

బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 4న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,500గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,820 గా ఉంది.

Written By: , Updated On : January 4, 2024 / 08:53 AM IST
Gold Prices

Gold Prices

Follow us on

Gold Prices: కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అటు వెండిధరలు సైతం తగి ఊరటనిచ్చాయి. అయితే నిన్న పెరిగిన స్థాయిలోనే తగ్గడం విశేషం.

బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 4న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,500గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,820 గా ఉంది. జనవరి 3న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,750తో విక్రయించారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,970గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,500 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.63,820 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.59,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.64,530తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,500 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,820తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,500తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,820తో విక్రయిస్తున్నారు.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.78,600గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే గురువారం వెండి ధరలు రూ.300 మేరకు తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.78,600గా ఉంది. ముంబైలో రూ.78,600, చెన్నైలో రూ.80,000, బెంగుళూరులో 76,500, హైదరాబాద్ లో రూ.80,000తో విక్రయిస్తున్నారు.