Rashi Phalalu: ఈ రాశుల వారికి ఆకస్మిక అదృష్టం..

ఈ రాశివారు ఈరోజు మానసికంగా ఆందోళనగా ఉంటారు. ఆస్తి సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం.

Written By: Chai Muchhata, Updated On : January 4, 2024 8:43 am

Rashi Phalalu

Follow us on

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జనవరి 4 గురువారం ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కుంభ, మిథునం, కర్కాటక రాశుల జీవితాల్లో మార్పులు జరగనున్నాయి. కొన్ని రాశుల వారికి శుభాలు జరగనున్నాయి. అలాగే కొన్ని రాశుల వారికి ఆకస్మిక అదృష్టం రానుంది. నేడు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
ఈ రాశివారు ఈరోజు మానసికంగా ఆందోళనగా ఉంటారు. ఆస్తి సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం.

వృషభం:
వ్యాపారస్తులకు ఒడిదొడుకులు ఉంటాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అవసరం మేరకు మాత్రమే ఖర్చులు చేయాలి. అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు.

మిథునం:
సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. సహోద్యోగులతో కలిసి పనిచేయాలి. సీనియర్ అధికారులు అండగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఖర్చులు పెరుగుతాయి.

కర్కాటకం:
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మానసిక సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. కార్యాలయాల్లో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది.

సింహ:
గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో శ్రమ పెరుగుతుంది. పెండింగులో ఉన్న సమస్యలు కొలిక్కి వస్తాయి. సామాజిక సేవలో పాల్గొనే వారికి అనుకూల వాతావరణం.

కన్య:
ఈ రాశివారు తమ ప్రియమైన వారితో ఎక్కువగా గడుపుతారు. ఇతరుల నుంచి కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి.

తుల:
వ్యాపారస్తులకు మంచి అవకాశం. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రియమైన వారితో సాయంత్రం ఉల్లాసంగా గడుపుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

వృశ్చికం:
ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టేవారికి అనుకూల సమయం. ఆర్థికపరమైన రంగాల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.

ధనస్సు:
ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ప్రయాణం చేసేవారు జాగ్రత్తలు పాటించాలి. ఫోన్ లో వచ్చే సమాచారం అసంంతృప్తిని తెస్తుంది.

మకర:
ఉద్యోగులు ఆకస్మిక ఆందోళనతో ఉంటారు. వైవాహిక జీవితం గడిపేవారికి ఖర్చులు పెరుగుతాయి. పనిభారం పెరుగుతుంది. వ్యాపారస్తుల ఆదాయం పెరుగుతుంది.

కుంభం:
జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. సీనియర్ల నుంచి సలహాలు పొందుతారు. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి.

మీనం:
వ్యాపారులు విజయం సాధిస్తారు. కుుటంబ సభ్యులతో ఆహ్లదంగా ఉంటారు. పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయి. సంబంధాలు మెరుగుపడుతాయి. ఆదాయం పెరుగుతుంది.