Hybrid cars : హైబ్రిడ్ కార్ల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే..

హైబ్రిడ్ కార్లలో పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ తో పాటు ఎలక్ట్రిక్ ఇంజిన్ కూడా ఉంటుంది. అంటే పరిస్థితులను బట్టి ఆయా ఇంజిన్ ను ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు లాంగ్ జర్నీ చేసే సమయంలో ఇంధనం అయిపోతే.. ఈ సమయంలో వెంటనే ఎలక్ట్రిక్ మోడ్ లోకి వెళ్లి ప్రయాణం కొనసాగించవచ్చు. ఇలా రెండు రకాల ఇంజిన్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి

Written By: Chai Muchhata, Updated On : August 21, 2024 11:28 am

Upcoming Hybride cars

Follow us on

Hybrid cars : పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో వినియోగదారులు ప్రత్యామ్నాయ వాహనాల కోసం ఎదురుచూశారు. ఈ తరుణంలో ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోనూ ఈవీల ఉత్పత్తి వేగం పెరిగింది. అయితే ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల అవసరమైన ఈవీలు అందుబాటులో లేవు. అంతేకాకుండా వినియోగదారులు వెంటనే ఈవీలకు మారడం కష్టతరంగా భావిస్తున్నారు. ఈ తరుణంలో కొన్ని కంపెనీలు హైబ్రిడ్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. హైబ్రిడ్ కార్లలో పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ తో పాటు ఎలక్ట్రిక్ ఇంజిన్ కూడా ఉంటుంది. అంటే పరిస్థితులను బట్టి ఆయా ఇంజిన్ ను ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు లాంగ్ జర్నీ చేసే సమయంలో ఇంధనం అయిపోతే.. ఈ సమయంలో వెంటనే ఎలక్ట్రిక్ మోడ్ లోకి వెళ్లి ప్రయాణం కొనసాగించవచ్చు. ఇలా రెండు రకాల ఇంజిన్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో చాలా మంది హైబ్రిడ్ కార్లను కోనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో కొన్ని కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే విధంగా కొన్ని హైబ్రిడ్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..

దేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి కంపెనీ అగ్రగామిగా నిలుస్తోంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే చాలా మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. వినియోదారులు అవసరాలను బట్టి కంపెనీ కొత్త కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం వినియోగదారులు ఎక్కవుగా హైబ్రిడ్ వాహనాలను కోరుకుంటున్నారు. ఈ తరుణంలో మారుతి నుంచి కొత్త హైబ్రిడ్ కారును మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ కంపనీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన స్విప్ట్ డిజైర్ ను హైబ్రిడ్ వేరియంట్ లో తీసుకురావడానికి రెడీ అయింది. దీనిని ఇప్పటికే టోక్యో మోటార్ షో లో ప్రదర్శించింది. స్విప్ట్ డిజైర్ హైబ్రిడ్ కారులో డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉండనుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 80 బీహెచ్ పీ పవర్, 108 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేసింది. దీంతో పాటు సింక్రోనస్ మోటార్ ను కలిగి ఉంటుంది. ఇది 60 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అతి త్వరలోనే ఈ హైబ్రిడ్ ఇంజిన్ కారును మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ రెడీ అవుతోంది. ఇందులో కొత్త టెక్నాలజీతో కూడిన ఫీచర్లు కొన్ని మారనున్నాయి.

దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా కంపెనీ దేశీయ ఆటో మార్కెట్లో దూసుకుపోతుంది. కియా నుంచి ఎస్ యూవీ వేరియంట్లో చాలా వరకు వినియోగదారులను ఆకర్షించాయి. తాజాగా దీని నుంచి కాంపాక్ట్ ఎస్ యూవి క్లావిస్ ను రిలీజ్ చేయబోతుంది. ఇందులో పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ ఇంజిన్ కలిగి ఉంటుంది. బాక్సీ డిజైన్ లో ఉండే కియా క్లావిస్ హైబ్రిడ్ 5 సీటర్ గా రాబోతుంది. సేప్టీ కోసం ఇందులో బెస్ట్ ఫీచర్లు ఉన్నాయని అంటున్నారు. 6 ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు వినియోగదారులు ఎక్కువగా కోరుకునేపనోరమిక్ సన్ రూప్ కూడా ఉంది. దీనిని రూ. 10 లక్షలప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉంది.