https://oktelugu.com/

TATA Punch: కారు కొనాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌.. ఈ కారుపై భారీ డిస్కౌంట్‌!

టాటా పంచ్‌ ఈవీ లాంచ్‌ అయిన తర్వాత తొలిసారిగా రూ.50 వేల వరకు తగ్గింపు అందిస్తోంది. అయితే ఈ తగ్గింపు దాటి టాప్‌ స్పెక్‌ పంచ్‌ ఈవీ ఎంపవర్డ్‌ + ఎస్‌ఎల్‌ఆర్‌ ఏసీ ఫాస్ట్‌ చార్జర్‌పై మాత్రమే అందుబాటులో ఉంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 13, 2024 / 12:47 PM IST

    TATA Punch

    Follow us on

    TATA Punch: మీరు కారు కొనే ఆలోచనలో ఉన్నారా.. మంచి ఆఫర్‌ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే దేశీయ ప్రముఖ ఆటోమొబైక్‌ సంస్థ టాటా తమ కార్లపై భారీగా డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈ ఏడాది విడుదల చేసిన టాటా పంచ్‌ ఈవీ వాహనంతోపాటు ఎస్‌యూవీపై డిస్కౌంట్‌ ప్రకటించింది. టాప్‌ వేరియంట్లపై మాత్రమే తగ్గింపు ఉంది. టాటా పంచ్‌ ఈవీ ఏప్రిల్‌ నెలలో కొనుగోలు చేస్తే రూ.50 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే టాటా పంచ్‌ దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్‌ ఎస్‌యూవీ. ఇది పెట్రోల్, ఎలక్ట్రిక్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ కారు ఫీచర్లు, అందుబాటులో ఉన్న తగ్గింపు ధర గురించి తెలుసుకుందాం.

    టాటా పంచ్‌పై ఈ ఆఫర్లు..
    టాటా పంచ్‌ ఈవీ లాంచ్‌ అయిన తర్వాత తొలిసారిగా రూ.50 వేల వరకు తగ్గింపు అందిస్తోంది. అయితే ఈ తగ్గింపు దాటి టాప్‌ స్పెక్‌ పంచ్‌ ఈవీ ఎంపవర్డ్‌ + ఎస్‌ఎల్‌ఆర్‌ ఏసీ ఫాస్ట్‌ చార్జర్‌పై మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర రూ.10.98 లక్షలు నుంచి రూ.15.49 లక్షల వరకు ఉంది. అంటే ఈ నెలలో కొనుగోలు చేస్తే ఈ తగ్గింపు వర్తిస్తుంది.

    ఫీచర్లు ఇవీ..
    ఇక టాటా పంచ్‌ ఈవీ సింగిల్‌ చార్జింగ్‌తో 315 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 421 కిలోమీటర్ల పరిధికి వెళ్తుంది. సేఫ్టీ కోసం ఈ కారులో ఎయిర్‌ బ్యాగ్స్, యాంటీ క్లాక్‌ బ్రేకింగ్, 360 డిగ్రీ కెమెరా, హర్మాన్‌ సౌండ్‌ సిస్టమ్, వైర్‌లెస్‌ ఫోన్‌ చార్జర్, ఫుష్‌–బటన్‌ స్టార్ట్‌/స్టాప్‌ బటన్, టెంపరేచర్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. డీసీ ఫాస్ట్‌ చార్జర్‌ సహాయంతో ఇది కేవలం 56 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు చార్జి చేయబడుతుంది. టాటా పంచ్‌ ఈవీ, స్మార్ట్, స్మార్ట్‌ +, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్‌ + వేరియంట్లలో అందుబాటులో ఉంది.