Vehicle Tyres: రోడ్డు ప్రమాదం అనగానే వాహనాలు ఢీకొనడం అనుకుంటాం. కానీ, రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటాయి. వేగం కారణంగా వాహనం అదుపు తప్పడం, ఏదైనా ఎదురు వచ్చినప్పుడు దానిని తప్పించే ప్రయత్నంలో, వాహనం కంట్రోల్ కాకపోవడం.. టైర్లు పేలడం ఇలా అనేకం ఉంటాయి. అయితే వాహనం నడుస్తుండగానే టైర్లు పేలడం తరచుగా వింటుంటాం. అలా ఎందుకు జరుగుతాయి. జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం.
టైర్లు పేలడానికి కారణాలు ఇవీ..
= టైర్లు పేలడానికి మొదటి కారణం ప్రెజర్.. టైరులో గాలి ఎక్కువ ఉన్నా.. తక్కువ ఉన్నా టైరు పగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
= వాహనం స్పీడ్ కూడా టైర్లు పేలడానికి కారణం. ఏ కంపెనీ టైరు అయినా.. ప్రతీ టైరుపై ఒక సీరియల్ నంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నంబర్ చివరన ఉండే ఆల్ఫాబెట్ ఆ టైర్ స్పీడ్ లిమిట్‌ను తెలియజేస్తుంది.
– ఆల్ఫాబెట్ L : టైరుపై ఉన్న సీరియల్ నంబర్ చివరన ఆల్ఫాబెట్ L ఉంటే దాని స్పీడ్ లిమిట్ 120 కిలోమీటర్లు మాత్రమే.
– ఆల్ఫాబెట్ M : టెరుపై ఉన్న సీరియల్ నంబర్ చివరన ఆల్ఫాబెట్ M ఉంటే దాని స్పీడ్ లిమిట్ 130 కిలోమీటర్లు మాత్రమే.
– ఆల్ఫాబెట్ N : టెరుపై ఉన్న సీరియల్ నంబర్ చివరన ఆల్ఫాబెట్ N ఉంటే దాని స్పీడ్ లిమిట్ 140 కిలోమీటర్లు మాత్రమే.
– ఆల్ఫాబెట్ P : టెరుపై ఉన్న సీరియల్ నంబర్ చివరన ఆల్ఫాబెట్ P ఉంటే దాని స్పీడ్ లిమిట్ 150 కిలోమీటర్లు ఉండాలి.
– ఆల్ఫాబెట్ Q : టెరుపై ఉన్న సీరియల్ నంబర్ చివరన ఆల్ఫాబెట్ Q ఉంటే దాని స్పీడ్ లిమిట్ 160 కిలోమీటర్లు మించకూడదు.
– ఆల్ఫాబెట్ R: టెరుపై ఉన్న సీరియల్ నంబర్ చివరన ఆల్ఫాబెట్ R ఉంటే దాని స్పీడ్ లిమిట్ 170 కిలోమీటర్లు దాటొద్దు.
– ఆల్ఫాబెట్ S : టెరుపై ఉన్న సీరియల్ నంబర్ చివరన ఆల్ఫాబెట్ S ఉంటే దాని స్పీడ్ లిమిట్ 180 కిలోమీటర్లు ఉండాలి.
– ఆల్ఫాబెట్ T : టెరుపై ఉన్న సీరియల్ నంబర్ చివరన ఆల్ఫాబెట్ T ఉంటే దాని స్పీడ్ లిమిట్ 190 కిలోమీటర్ల కన్నా మించి వెళ్లకూడదు.
పైన సూచించిన స్పీడ్ లిమిట్ దాటినా టైర్లు పగిలిపోయే అవకాశం ఉంటుంది.